Fake IPS: హైదరాబాద్‌లో నకిలీ ఐపీఎస్ అధికారిని అరెస్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు. ఐపీఎస్ అధికారిని, ఆర్మీ కల్నల్ అని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఏపీలోని భీమవరం పట్టణానికి చెందిన కార్తీక్ అలియాజ్ నాగరాజుగా గుర్తించారు.
టెక్నికల్‌గా ఆరితేరిన కార్తిక్.. ప్రభుత్వ అధికారులు, ధోనీతో ఉన్నట్లుగా ఫొటోలు క్రియేట్ చేశాడు. వాటిని చూపిస్తూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదవులు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడు. పలు సెటిల్మెంట్లు కూడా చేశాడు. సైబరాబాద్‌లో ఏకంగా ఓ కార్యాలయాన్ని ఓపెన్ చేసి.. అక్కడ సెటిల్మెంట్ల పేరుతో పలువురిని చితకబాదిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
కార్తీక్‌పై దేశవ్యాప్తంగా 8 కేసులు నమోదయ్యాయన్నారు మాధాపూర్ డీసీపీ. మధుసూదన్ అనే వ్యక్తిని బెదిరించడంతో పంజాగుట్టలో కూడా అతనిపై కేసు నమోదైందని తెలిపారు. కార్తీక్‌ను అరెస్టు చేసి అతని నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్‌తో పాటు 23 వస్తువులను సీజ్ చేశారు. 2 లక్షల విలువైన ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు.
Leave a Comment