EPAPER

Biker Arrested: టపాసులతో బైక్ స్టంట్స్.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో.. వారిని ఏం చేశారో తెలుసా?

Biker Arrested: టపాసులతో బైక్ స్టంట్స్.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో.. వారిని ఏం చేశారో తెలుసా?

Biker Arrested: నిప్పులు చిమ్మే బైక్స్ తో.. గాల్లో చక్కర్లు కొట్టారు.. ప్రమాదమని తెలిసినా సరదా పేరిట హల్చల్ చేశారు.. పోలీసుల మాటలు పెడచెవిన పెట్టారు. చివరికి తమ తల్లిదండ్రులనే పోలీస్ స్టేషన్ బాట పట్టేలా చేశారు. దీనితో పోలీసులు కూడా తమదైన స్టైల్ లో వారిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇంతకు వీరంతా ఎవరో తెలుసా.. దీపావళి రోజు హైదరాబాద్ లో ఖరీదైన బైక్స్ తో స్టంట్లు చేసి హల్చల్ చేశారు కదా.. వారే వీరు.


హైదరాబాద్ లో అందరూ టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటే, కొందరు యువత మాత్రం అందుకు భిన్నంగా పండుగ జరుపుకున్నారు. అది కూడా హైటెక్ సిటీ, మై హోం భుజ ప్రాంతాలలో బైక్స్ కి క్రాకర్స్ ఏర్పాటు చేసుకొని, స్టంట్ లు చేశారు కొందరు. అదెలాగో తెలుసా ఆ స్టంట్స్ చూస్తే ప్రాణాలు గాల్లోకి లేచి పోవాల్సిందే.

రన్నింగ్ బైక్ పై ఒకే ఒక్క చక్రం భూమి పై ఉంచి, పటాసులు బైక్ తోనే కాలుస్తూ వీరు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే వీరు చేసిన బైక్ స్టంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. దీనితో సాక్షాత్తు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం స్పందించి.. దీపావళి పండుగ రోజు ఇదేమి వికృతానందం, ఎటు వెళుతుంది సమాజమంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు. పండగ రోజు యువత ఇలాంటి వెర్రివేషాలు వేస్తూ, అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.


అలాగే ఈ వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించింది. వైరల్ గా మారిన వీడియోల ఆధారంగా రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి స్టంట్ లు చేసిన యువతను అరెస్ట్ చేశారు. అంతేకాదు పటాస్ మూవీ సినిమా తరహాలో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారట పోలీసులు.

ఈ సందర్భంగా బిగ్ టీవీతో రాయదుర్గం సీఐ వెంకన్న మాట్లాడుతూ.. వీకెండ్ సమయంలో ఖరీదైన బైక్ లతో యువకులు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గత కొద్దిరోజుల నుండి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి, ఏకంగా 350 బైక్స్ లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

కేవలం 2 రోజుల్లో 25 మందిపై కేసు నమోదు చేసి, బైక్స్ ను స్వాధీనం చేసుకున్నామని, దీపావళి రోజు బైకులపై క్రాకర్స్ కాలుస్తూ స్టంట్స్ చేసిన వారిని సీసీ కెమెరాలు ఫుటేజ్ ద్వారా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఇప్పటినుండి ప్రతిరోజు ఐటీ కారిడార్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, అనవసరంగా అర్ధరాత్రి బైక్ లపై వచ్చి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడ్డ యువత తల్లిదండ్రులను కూడా స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించామని, రిపీటెడ్ గా పట్టుబడ్డ వారి లైసెన్సులను సస్పెండ్ చేయాలని ఆర్టీవో అధికారులకు లెటర్ రాసినట్లు సీఐ తెలిపారు.

Also Read: Bhatti Vikramarka on BRS: బీఆర్ఎస్ పాలనలో అంతా శూన్యమే.. ప్రపంచ స్థాయి పోటీకి మేము సిద్దం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

యువత సరదాలను కోరుకోవచ్చు కానీ, సరదాలను విషాదాలుగా మార్చుకొనేలా ప్రవర్తించరాదంటున్నారు పెద్దలు. ఇప్పటికైనా ఇటువంటి బైక్స్ స్టంట్స్ చేసేవారిని గుర్తించి పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని, అప్పుడే యువత గాడి తప్పకుండా ఉంటారన్నది వారి వాదన.

Related News

Kondakal Village Land Scam: కొండకల్ క్లియరెన్స్ పై ఈడీ ఫోకస్‌.. బాధితులకు ‘స్వేచ్ఛ’ ఆహ్వానం

CM Revanth Reddy: బర్త్ డే రోజున పాదయాత్ర.. మూసీ పునరుజ్జీవంపై దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth : విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తాం – విద్యార్ధులకు సీఎం రేవంత్ హామీ

Congress : ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా.. సాఫీగా జరగాల్సిందే – సీఎం రేవంత్

BC Commission : రిజర్వేషన్స్ కమిషన్ ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన బీసీ నేతలు

Aghori In Kushna Palli: అఘోరీ నాగ సాధువు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? వందల సంఖ్యలో అఘోరాలు రానున్నారా?

Cutis International Hyderbad : హైదరాబాద్ లో క్యూటిస్ ఇంటర్నేషనల్ సేవలు ప్రారంభం

Big Stories

×