EPAPER

Pawan: జనసేనాని మాటలకు అర్థాలే వేరులే!.. క్లారిటీతో కూడిన కన్ఫ్యూజన్!!

Pawan: జనసేనాని మాటలకు అర్థాలే వేరులే!.. క్లారిటీతో కూడిన కన్ఫ్యూజన్!!

Pawan: కొండగట్టు అంజన్న అంజన్న సాక్షిగా జనసేనాని మరోసారి క్లారిటీతో కూడిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. పొత్తుల గురించి అలా, ఇలా.. అంటూ పలు ప్రతిపాదనలు పెట్టారు. ఒక్క వైసీపీతో కలుస్తాం అని చెప్పడం మినహా.. మిగతా ఆప్షన్లు అన్నిటినీ ముందేసుకున్నారు. మరి, వాటిలో ఏది వర్కవుట్ అవుతుందో? ఎన్నికలకు ఎలా వెళ్తారో.. ప్రస్తుతానికైతే పవన్ కల్యాణ్ కు కూడా క్లారిటీ లేనట్టు అనిపిస్తోంది. పవన్ ప్రధానంగా 3 ఆప్షన్లు చెప్పారు.


ఆప్షన్ 1: బీజేపీతో కలిసే ఉన్నాం.. ఉంటాం.
ఇదీ ఆయన మొదటి ప్రయారిటీ. బీజేపీతో ఉండాలని జనసేనాని బలంగా కోరుకుంటున్నారు. కానీ, రెండు చేతులు కలిస్తేనేగా చప్పట్లు మోగేవి? కమలనాథులు ఈమధ్య పవన్ కల్యాణ్ ను అంతగా పట్టించుకోవట్లేదు. టీడీపీతో జనసేనాని స్నేహంగా ఉంటుండటంపై.. కాషాయదళం గుర్రుగా ఉంది. ఉంటే గింటే మాతోనే ఉండాలి కానీ.. మధ్యలో చంద్రబాబును ఎందుకు తీసుకొస్తున్నారనేది బీజేపీ అలక. అందుకే, తాజాగా జరుగుతున్న పార్టీ కార్యవర్గ సమావేశంలోనూ జనసేన ప్రస్తావనే తీసుకురాలేదు. జనసేనతో పొత్తు అంశం లేకుండానే తీర్మానం చేసేశారు. ఇక, పవన్ ను పూర్తిగా సైడ్ చేసేటట్టే ఉన్నారు కమలనాథులు. టీడీపీతోనూ సభ్యతగా ఉంటుండటం బీజేపీకి అసలేమాత్రం ఇష్టం ఉండట్లేదంటున్నారు.

అయితే రాష్ట్ర బీజేపీతో పవన్ కు అంతగా పొసగకపోయినా.. కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇటీవల ప్రధాని మోదీ విశాఖ వచ్చినప్పుడు.. జనసేనానికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ.. ఎప్పుడో ఇస్తానన్న రోడ్ మ్యాప్ ఇప్పటికీ ఇవ్వకపోవడమే ఆసక్తికరం. ఇటు పవన్ తో పొత్తు కొనసాగిస్తూనే.. అటు వైసీపీతోనూ రహస్య స్నేహం నెరుపుతుండటంతో కమలనాథుల డబుల్ గేమ్ పాలిటిక్స్ పై చర్చ నడుస్తోంది.


ఆప్షన్ 2: బీజేపీ కాదంటే ఒంటరిగానే ఎన్నికలకు పోతాం.
అవును, ఒంటరి పోరుకూ జనసేనాని సై అనేశారు. ఇది మాత్రం చాలా కొత్త పాయింట్. ఇన్నాళ్లూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోనంటూ పదే పదే చెప్పిన పవన్ కల్యాణ్.. కొండగట్టు అంజన్న సాక్షిగా కొత్త ప్రకటన చేశారు. బీజేపీ కాదంటే ఒంటరిగానే పోటీ చేస్తాం అంటూ సంచలన విషయం వెల్లడించారు. ఎందుకు? పవన్ ఎందుకు ఒంటరిగా పోటీ చేస్తాం అంటున్నారు? బీజేపీ తటస్థంగా ఉంటోంది.. టీడీపీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది.. జనసేనాని ఒక్కరే పొత్తులు, కలిసిపోటీ అంటూ పదే పదే చెబుతున్నారు. టీడీపీతో కలవడం బీజేపీకి ఇష్టం లేదు. పవన్ తో పొత్తుపెట్టుకుంటే జనసేనకి అధికంగా సీట్లు కేటాయించాల్సి రావొచ్చనేది టీడీపీ బెదురు. అందుకే, పవన్ ఎంతలా గింజుకుంటున్నా.. చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకూ పొత్తులపై నోరు మెదప లేదు. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. జనసేనాని సైతం ఈ విషయం గుర్తించే.. బీజేపీ, టీడీపీ లేకున్నా.. అవసరమైతే ఒంటరిగానే ఎన్నికలకు పోతామంటూ కొత్త ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. అందుకే, 2014 కాంబినేషన్ పై కాలమే నిర్ణయిస్తుందంటూ అంజన్న సన్నిధిలో వేదాంతం పలికారు పవన్ కల్యాణ్.

ఆప్షన్ 3: బీజేపీ కాదంటే కొత్తవాళ్లతో పోతాం.
ఇది అందరికీ తెలిసిన ఆప్షనే. బీజేపీ కాదంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని పవన్ పరోక్షంగా చెప్పారు. టీడీపీతో పొత్తుకు పవన్ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నా.. చంద్రబాబే సంగం టికెట్లు ఇవ్వాల్సి వస్తుందేమోననే భయంతో కాస్త న్యూట్రల్ గా ఉంటున్నారని అంటున్నారు.

ఇలా, పవన్ చెప్పిన మూడు ఆప్షన్లు కీలకమే. కాకపోతే, ఎందులోనూ క్లారిటీ లేదు. ఈ మూడింట్లో ఏది వర్కవుట్ అవుతుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. అందుకే, ఎన్నికలకు వారం ముందే పొత్తుల గురించి ఆలోచిస్తానంటూ.. అప్పుడే క్లారిటీ వస్తుందంటూ.. పవన్ కల్యాన్ సైతం తన కొత్త స్ట్రాటజీపై క్లియర్ కట్ గా తేల్చేశారు. అంటే, ఒక్క వైసీపీకి మినహా అందరికీ వారాహి డోర్లు తెరిచే ఉంటాయనా? ఎవరితోనూ పొత్తు కుదరకపోతే.. సింహం సింగిల్ గా అన్నట్టు మరోసారి ఒంటరి పోరుకు పవన్ సై అంటారా?

Related News

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Big Stories

×