EPAPER

pawan: తెలంగాణలోనూ బీజేపీ, జనసేన పొత్తు!.. కేసీఆర్ కు కంగారే..

pawan: తెలంగాణలోనూ బీజేపీ, జనసేన పొత్తు!.. కేసీఆర్ కు కంగారే..

pawan: కొండగట్టు అంజన్న సాక్షిగా జనసేనాని కీలక రాజకీయం నెరిపారు. రెండు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఏపీలో బీజేపీతో పొత్తు కొనసాగకపోతే.. ఒంటరిగానైనా పోటీ చేస్తామంటూ హింట్ ఇచ్చి కలకలం రేపారు. ఈసారి తెలంగాణలోనూ పోటీ చేస్తామని ప్రకటించి మరింత సంచలనంగా నిలిచారు. తెలంగాణలో జనసేనతో పొత్తు కోసం ఎవరైనా వస్తే చూస్తామంటూ అటెన్షన్ క్రియేట్ చేశారు. పవన్ వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించేనంటూ ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిస్తే..? ఈ మాటే మిగతా పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.


ఏపీ వేరు. తెలంగాణ వేరు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి పెద్దగా సీన్ లేదు కాబట్టి.. పవన్ కల్యాణ్ తో ఉన్నా లేకున్నా మార్పేమీ ఉండదు. కానీ, తెలంగాణలో అలాకాదు. ఈసారి ఒంటరిగానే కేసీఆర్ ను దెబ్బ కొడతామంటూ కమలనాథులు కత్తులు దూస్తున్నారు. సమరోత్సాహంతో రాజకీయం చేస్తున్నారు. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ బండి టాప్ గేర్ లో దూసుకుపోతోంది. మధ్యలో కాంగ్రెస్ లేకుంటే బీజేపీ జోరుకు తిరుగు ఉండేది కాదంటున్నారు.

జనసేనాని కొండగట్టుకు రావడం.. తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించడం.. పొత్తుకు సైతం సై అంటూ సిగ్నల్ ఇవ్వడం.. ఇవన్నీ బీజేపీకి కలిసొచ్చే అంశాలే అంటున్నారు. ఏపీ రాష్ట్ర నాయకత్వంతో పవన్ కు పొసగకపోయినా.. తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పవన్ కు సత్సంబంధాలే ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఎవరైనా ముందుగా చేయి చాచితే చాలు.. వాళ్ల బంధం ఫెవికాల్ బాండ్ గా బలంగా, ధృడంగా మారడం ఖాయం.


ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన పొత్తు కుదిరితే.. పొలిటికల్ సీన్ అమాంతం మారిపోతుందని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ పలు ప్రాంతాల్లో బలంగా ఉంది. పవన్ కల్యాణ్ కు తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే.. బీజేపీ ఓటు బ్యాంక్ + పవన్ ఫ్యాన్స్.. తిరుగులేది ఈ కాంబినేషన్ కి అని అంచనా వేస్తున్నారు. 2014లో ఏపీలో జరిగిన సీనే ఇక్కడా రిపీట్ అవుతుందని అంటున్నారు.

తెలంగాణలో బీజేపీ, జనసేనల పొత్తుకు పెద్దగా అడ్డంకులు కూడా ఏమీ ఉండకపోవచ్చు. ఏపీలా కాకపోవచ్చు. పవన్ కల్యాణ్ మరీ ఎక్కువ సీట్ల కోసం పట్టుపట్టకపోవచ్చు. ఎన్నిస్తే అన్ని స్థానాలతో సర్దుకుపోతారు. ఇది కూడా బీజేపీకి అనుకూలాంశమే. కాకపోతే అధికారంలోకి వస్తే.. ప్రభుత్వంలో భాగస్వామ్యం కోరుకోవచ్చు. అంతే. అంతకుమించి జనసేన ఇంకేమీ ఆశించకపోవచ్చు. ఇలా ఎలా చూసినా.. జనసేనతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీకి అన్నీ అడ్వాంటేజేస్ లే కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. ఎన్నికల నాటికి బీజేపీ, జనసేన కలిస్తే.. గులాబీ బాస్ కు దబిడి దిబిడే..అంటున్నారు.

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×