EPAPER
Kirrak Couples Episode 1

Telugu states : తెలుగు రాష్ట్రాల మధ్య భూముల ధరల పంచాయితీ.. మాటల యుద్ధం

Telugu states : తెలుగు రాష్ట్రాల మధ్య భూముల ధరల పంచాయితీ.. మాటల యుద్ధం

Telugu states News(Morning news today telugu): తెలుగు రాష్ట్రాల మధ్య భూముల ధరల పంచాయితీ మొదలైంది. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చు అంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్‌ అయ్యాయి . ఈ మాట తాను అనడం లేదని….చంద్రబాబే చెప్పారని అంటున్నారు కేసీఆర్‌. రోజురోజుకు తెలంగాణలో భూముల ధరలు అమాంతం పెరుగుతున్నాయన్నారు.

ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్ముకొంటే తెలంగాణ మూడేకరాలు వచ్చేవి కానీ గత నాలుగేళ్లుగా ఏపీలో అభివృద్ధి నిలిచిపోవడంతో భూముల ధరలు పెరగలేదంటూ ఇటీవల కామెంట్స్‌ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలంగాణలో జోరుగా అభివృద్ధి జరుగుతుండటంతో అక్కడ భూముల ధరలు బాగా పెరిగాయని…. ఇప్పుడు అక్కడ ఒక ఎకరం అమ్ముకొంటే ఏపీలో 50-100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు. ఇందుకు.. ఏపీలో అభివృద్ధి లేకపోవడమే కారణమన్నారు.


చంద్రబాబు వ్యాఖ్యలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్‌. తెలంగాణలో భూముల గురించి పక్క రాష్ట్రాలే చెబుతున్నాయని అంటున్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు….. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కౌంటరిచ్చారు. ఏపీలో భూముల ధరలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడారో తెలియదన్నారు. విశాఖలో కూడా ఎకరం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హైదరాబాద్ కాకుండా బయటికి వెళితే ధర ఎక్కడుందని ప్రశ్నించారు.


Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×