EPAPER

Palakurthi : పాలకుర్తిలో ఖాళీ అవుతున్న కారు.. కాంగ్రెస్ లోకి జోరుగా వలసలు

Palakurthi : పాలకుర్తిలో ఖాళీ అవుతున్న కారు.. కాంగ్రెస్ లోకి జోరుగా వలసలు
telangana congress party news

Congress Palakurthi meeting(Telangana congress party news):

పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు సాగుతుండటంతో కారు ఖాళీ అవుతోంది. ఝాన్సీ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌పై నియోజకవర్గంలో క్రేజ్‌ పెరిగింది. యశస్విని రెడ్డికి టికెట్ ఇవ్వడంతో మరింత జోష్‌ వచ్చింది. ఇప్పటివరకు పాలకుర్తి మండలంలో 8 మంది సర్పంచులు, ముగ్గురు ఎంపీటీసీలు కాంగ్రెస్‌లో చేరారు. రాయపర్తి మండలం నుంచి ముగ్గురు సర్పంచులు, ఒక ఎంపీటీసీ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. తొర్రూరు మండలంలో బీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు సర్పంచులు కాంగ్రెస్‌లో చేరారు. పాలకుర్తిలో 14 మంది సర్పంచులు, నలుగురు ఎంపీటీసీలు, 10 మంది ఉపసర్పంచులు, 100 మంది వార్డు మెంబర్లు కాంగ్రెస్‌కు జైకొట్టారు.


వీరితో పాటు 10 మంది మాజీ సర్పంచులు, ఐదుగురు మాజీ ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరో 10 మంది సర్పంచులు, ఐదుగురు ఎంపీటీసీలు కాంగ్రెస్‌లో చేరతారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎర్రబెల్లి ప్రధాన అనుచరుల్లో చాలా మంది ఇప్పటికే హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ గూటికి చేరిన ప్రధాన నేతల్లో తొర్రూరు ప్యాక్స్ చైర్మన్, వరంగల్ డీసీసీబీ డైరెక్టర్ కాకిరాల హరిప్రసాద్.. బీజేపీ రాష్ట్ర నాయకుడు పెదగాని సోమయ్య.. ఎర్రబెల్లి బంధువు, వరంగల్ జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు.. నెహ్రూ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, బీజేపీ రాష్ట్ర నేత వెంగళ్‌రావు ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వరుస చేరికలతో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయని గులాబీ నేతలే అంటున్నారు. చేరికల జోరు చూస్తుంటే.. పోలింగ్‌కు ముందే కారు ఖాళీ అవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

.


.

.

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×