EPAPER

Gaddam Sammaiah : పాలకుర్తి నివాసికి పద్మశ్రీ.. గడ్డం సమ్మయ్యను సన్మానించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..

Gaddam Sammaiah : పాలకుర్తి నివాసికి పద్మశ్రీ.. గడ్డం సమ్మయ్యను సన్మానించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..
Pakurthi MLA Yashaswini reddy Felicitated Gaddam Sammaiah

Gaddam Sammaiah : పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు వారి ఇంటికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని ఉందన్నారు. గ్రామీణ కళలను ప్రోత్సహించడానికి పాలకుర్తి నియోజకవర్గం లో ప్రత్యేక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కళాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.


కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చిందుయక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యది నిరుపేద కుటుంబం. జనగామ జిల్లా దేవురుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన ఆయన ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తండ్రి రామస్వామి నుంచి యక్షగాన కళను వారసత్వంగా పొందిన సమ్మయ్య.. 12వ ఏట నుంచే రంగస్థల వేదికపై రకరకాల పాత్రలు వేస్తూ కళను ప్రదర్శిస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో దాదాపు 19 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.

పౌరాణిక కథలతోపాటు పలు సామాజిక అంశాలపై ప్రజల్లో ప్రచారం చేశారు. అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణపై పాటలు, పద్యాలతో ఆకట్టుకున్నారు. చిందుయక్ష కళాకారుల సంఘం, గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం.. వంటివి స్థాపించి కళను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారాయన. ఆయన భార్య శ్రీరంజని కూడా యక్షగాన కళాకారిణే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో ‘కళారత్న హంస’ పురస్కారం అందుకున్నారు. ఇటీవల అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రామాయణ గాధకు సంబంధించి 5 ప్రదర్శనలు ఇచ్చారు సమ్మయ్య.


కేంద్ర ప్రభుత్వం చిందు యక్షగాన కలలను గుర్తించి మారుమూల గ్రామీణ ప్రాంతమైన అప్పిరెడ్డిపల్లి గ్రామ పేద కుటుంబానికి చెందిన తనకు పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం తన జాతికి, చిందు కులానికి గర్వకారణం అన్నారు సమ్మయ్య. ఎన్నో కష్టాలు ఎదురైనా గత 30 సంవత్సరాలుగా చిందు యక్షగానం కలను కాపాడుతూ వన్నె తీసుకొచ్చానన్నారు. చిందు యక్షగానమైన గ్రామీణ కళను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం తన అదృష్టం అన్నారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడంతో సమ్మయ్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

Big Stories

×