EPAPER
Kirrak Couples Episode 1

Staff Nurse Posts : తెలంగాణలో స్టాఫ్‌ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్ .. దరఖాస్తులకు ఆహ్వానం..

Staff Nurse Posts : తెలంగాణలో స్టాఫ్‌ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్ .. దరఖాస్తులకు ఆహ్వానం..

Staff Nurse Posts : తెలంగాణలో 5,204 స్టాఫ్‌ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డీఎంఈ, డీహెచ్‌ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులతోపాటు వివిధ విభాగాల్లో ఖాళీలను మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్‌) ఉత్తీర్ణత సాధించాలి. అలాగే తెలంగాణ స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో వివరాల నమోదు చేసుకొని ఉండాలి.


అభ్యర్థుల వయస్సు 44 ఏళ్లు మించరాదు. ఉద్యోగులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అదే సమయంలో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని అనుభవం ఉంటే లెక్కలోకి తీసుకుంటారు. దరఖాస్తు రుసుంను 620 రూపాయలుగా నిర్ణయించారు. హైదరాబాద్ , వరంగల్ , ఖమ్మం, నిజామాబాద్ లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 25 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 15 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించడానికి గడువు ఉంది.

అర్హతలు: జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్‌) ఉత్తీర్ణత
వయసు: 01/07/2022 నాటికి 44 సంవత్సరాలు మించరాదు
ఎంపిక: రాత పరీక్ష
దరఖాస్తు, పరీక్ష రుసుం: రూ.620
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 25-01-2023
ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 15-02-2023
వెబ్‌సైట్‌: https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm


Related News

RRC WR Recruitment 2024: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

Big Stories

×