EPAPER

Ganesh Immersion 2024: సాగర్ చుట్టూ బారికేడ్లు.. గణపయ్య నిమజ్జనానికి దారేది ?

Ganesh Immersion 2024: సాగర్ చుట్టూ బారికేడ్లు.. గణపయ్య నిమజ్జనానికి దారేది ?

No Permission for Ganesh Immersion in Hussain Sagar: వినాయకచవితి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం, ఆఖరి ఘట్టం వినాయకుని నిమజ్జనం. వినాయక నిమజ్జనాలు హైదరాబాద్ లో కోలాహలంగా జరుగుతాయి. కానీ.. గతేడాది హైకోర్టు గణేష్ నిమజ్జనాలపై ఇచ్చిన తీర్పు ఆధారంగా పోలీసులు, జీహెచ్ఎంసీ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాలను ఆపివేశాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు వీల్లేదని పేర్కొంటూ.. ట్యాంక్ బండ్ చుట్టూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. అలాగే ట్యాంక్ బండ్ చుట్టూ ఇనుప కంచెలను ఉంచారు.


జీహెచ్ఎంసీ, పోలీసుల తీరుపై గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోలీసులు మాత్రం.. PoP విగ్రహాలను సాగర్ లో నిమజ్జనం చేసేందుకు అనుమతించడం లేదు. బేబీ పాండ్స్ లోనే PoP విగ్రహాలను నిమజ్జనం చేయాలని చెబుతున్నారు.

Also Read: గణేష్ నిమజ్జనాలు.. నేటి నుంచి హైదరాబాద్ లోని ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు


హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలతో వ్యర్థాలు పెరుగుతున్నాయని వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. గతేడాది సెప్టెంబర్ 25న PoP విగ్రహాల నిమజ్జనానికి అనుమతి నిరాకరిస్తూ తీర్పు చెప్పింది. దాంతో పోలీసులు, జీహెచ్ఎంసీ ట్యాంక్ బండ్ చుట్టూ విగ్రహాలను నిమజ్జనం చేయకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యాహ్నం విచారణ జరపనుంది. మరి గణపయ్య నిమజ్జనాలకు హైకోర్టు రూట్ క్లియర్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related News

Special Trains: సంక్రాంతి.. కోచ్‌ల పెంపు, ఆపై ప్రత్యేకంగా రైళ్లు!

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Big Stories

×