EPAPER

No Confidence Motion : గులాబీ కోటకు బీటలు.. చేజారుతున్న మున్సిపాలిటీలు..

No Confidence Motion : గులాబీ కోటకు బీటలు.. చేజారుతున్న మున్సిపాలిటీలు..

No Confidence Motion : అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. క్రమక్రమంగా పార్టీ పునాదులు బీటలు వారుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ కూడా చేజారింది. ఈ చైర్మన్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. నేరేడుచర్ల మున్సిపల్‌ ఛైర్మన్‌ జయబాబుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కౌన్సిలర్లు. మొత్తం 14 మంది సభ్యుల్లో 13 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దుతు తెలపగా.. ఛైర్మన్‌ జయబాబు ఒంటరిగా మిగిలిపోయాడు. దీంతో ఛైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది కాంగ్రెస్‌. నూతన ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బచ్చలకూరి ప్రకాష్‌ను ఎన్నుకున్నారు. వైస్‌ ఛైర్మన్‌గా అలక సరితారెడ్డికి మద్దతు ప్రకటించారు మెజార్టీ కౌన్సిలర్లు.


అటు భువనగిరి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఆంజనేయులు, వైస్‌ ఛైర్మన్‌ కిష్టయ్యపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానంపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు సంతకాలు చేశారు. ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్‌కు 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ల అసమ్మతి సెగ తగడలంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.


Tags

Related News

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×