Big Stories

Nirmala: జోకులొద్దు.. కేసీఆర్‌కో దండం.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం..

Nirmala: చూట్టానికి సింపుల్ గానే ఉంటారు. మాటలు కూడా స్మూత్ గానే ఉంటాయి. చేష్టలు కూడా నైస్ గానే కనిపిస్తాయి. ఇదంతా డిప్లమాటిక్ గా ఉన్నప్పుడే. అదే, విమర్శలు చేస్తే మాత్రం ఊరికే వదిలిపెట్టరు. పదునైన కౌంటర్లు ఇస్తుంటారు. కేంద్రంపై, దేశ ఆర్థిక వ్యవస్థపై చిన్నమాట కూడా పడనీయరు. అలాంటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లేటెస్ట్ గా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై జోకులొద్దు అంటూ చేతులు జోడించి వేడుకుంటూనే.. మీ అప్పులు సంగతి ఏంటంటూ సీఎం కేసీఆర్ను నిలదీశారు నిర్మల.

- Advertisement -

హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు లక్షా 39 వేల కోట్లు గ్రాంట్స్ రూపంలో వచ్చాయన్నారు. 2022- 23కు గాను రూ.3048 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు.

- Advertisement -

ఇక, 2014లో తెలంగాణకు రూ.60 వేల కోట్ల అప్పు ఉంటే.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు ఎలా వెళ్లిందని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు కేంద్ర మంత్రి నిర్మల.

మెడికల్ కాలేజీల ఏర్పాటుపైనా కేసీఆర్ ను కార్నర్ చేశారు నిర్మల. 2014 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు స్థాపించామని.. ఆయా కళాశాలల దగ్గర నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్టు తాజా బడ్జెట్ లో ప్రకటించామని చెప్పారు. అయితే, తెలంగాణకు మెడికల్ కాలేజీలు రాలేదని ఇప్పుడు బాధపడితే ఏంటి లాభమని ప్రశ్నించారు. తెలంగాణలో ఏయే జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవో ఆ జిల్లాల పేర్లు పంపించాలని కేంద్రం అడిగినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.

కరీంనగర్, ఖమ్మంలో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయని.. తిరిగి అవే జిల్లాల పేర్లను మెడికల్ కాలేజీల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించడం ఏంటని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. అందుకే, తాము తిరస్కరించామని.. అయినా కొత్త జిల్లాల పేర్లను ఇప్పటికీ పంపించలేదని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఏ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయో? ఎక్కడ లేవో అనే విషయం తెలంగాణ ప్రభుత్వం వద్దే లేదని, అందుకే ఇవ్వలేకపోయారని విమర్శించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News