NiranjanReddy: తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆక్రమణలపై రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్ర విమర్శలు చేయగా.. తాజాగా ఆయనపై ఏకంగా హరిత ట్రిబ్యునల్‌లోనే ఫిర్యాదు చేశారు. బీసీ పొలిటికల్ JAC ఛైర్మన్ యుగేంధర్‌గౌడ్ చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కంప్లైంట్ ఇచ్చారు. మంత్రి నిరంజన్ రెడ్డి నదీ భూమిని కబ్జా చేశారని.. దానిపై విచారణ జరిపించాలంటూ NGT దృష్టికి తీసుకొచ్చారు.
మంత్రి నిరంజన్‌రెడ్డి కృష్ణా నదిని కబ్జా చేసి, రీ సిల్టింగ్ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇటీవల ఆరోపించారు. గిరిజనుల పేరిట 7 కోట్ల సబ్సిడీ రుణం తీసుకున్నారని అన్నారు. మంత్రి 80 ఎకరాలు కొని.. 165 ఎకరాల ఫామ్‌హౌస్ ఎలా కట్టారంటూ ప్రశ్నించారు. గతంలో ఇలాంటి ఆరోపణలపై ఈటలను కేబినెట్ నుంచి తొలగించారు. ఇప్పుడు నిరంజన్‌రెడ్డిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు ఎందుకని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపణలపై మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తానెలాంటి కబ్జాలకు పాల్పడలేదని.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు.
కట్ చేస్తే.. మేటర్ కేసీఆర్ వరకూ చేరింది. బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్‌లో తలాతోక లేనోడు ఆరోపిస్తే.. నువ్ స్పందిస్తావా? నీకేం పనిలేదా? అలాంటి వాటిని పట్టించుకోవద్దంటూ కేసీఆర్ గట్టిగానే క్లాస్ ఇచ్చారు మంత్రి నిరంజన్‌రెడ్డికి.
ఇలా రాజకీయ రచ్చ నడుస్తున్న నేపథ్యంలోనే.. మంత్రి నిరంజన్‌పై బీసీ పొలిటికల్ JAC ఛైర్మన్ NGTలో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.