EPAPER
Kirrak Couples Episode 1

TS & AP: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్..

TS & AP: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్..

TS & AP: TSPSC పేపర్ లీక్ కేసులో రాజకీయ నేతలకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించారు. కేసు విషయంలో తెలిసిన సమాచారాన్ని దర్యాప్తు బృందానికి ఇవ్వాలని నోటీసులో కోరారు.


TSPSC పేపర్ లీకేజీలపై NSUI తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్‌తో కాకుండా.. CBI లేదా లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని కోరారు. విచారణ జరిపిన న్యాయస్థానం….రేపటికి వాయిదా వేసింది.

వివేకా హత్య కేసులో దస్తగిరిని అప్రూవర్‌‌గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.


ఏపీవ్యాప్తంగా సీపీఐ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 1ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

కరీంనగర్‌లో BRS కార్పొరేటర్‌ భర్త హత్యకు గుర్తు తెలియ వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. సుధగోని కృష్ణ ఇంటి దగ్గర గ్యాంగ్ చక్కర్లు కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీ సాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వడగళ్ల వానతో వికారాబాద్ జిల్లాలోనే కనీసం 6 వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని YSRTP అధ్యకురాలు షర్మిల అన్నారు . మోమిన్‌పేట మండలంలో పంట నష్టాన్ని రైతులతో కలసి ఆమె పరిశీలించారు. నష్టపోయిన పంటలకు పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

లిక్కర్ స్కామ్ నిందితుడు అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఏప్రిల్ 12న తదుపరి విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది. కీలక నిందితుల విచారణ కొనసాగుతుండగా బెయిల్ ఇవ్వడం కుదరదని ఢిల్లీ కోర్టు తెలిపింది.

భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషీడాతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. 2023.. భారత్-జపాన్‌ మధ్య టూరిజం ఏడాది కానుందని జపాన్ ప్రధాని అన్నారు. ఇరుదేశాల బంధం మరింత బలపడుతుందని నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు.

కేసుల నుంచి తప్పించుకోవడానికే మమతా బెనర్జీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ అన్నారు. మోదీ, దీదీ భాషలకు.. పెద్ద తేడా లేదని రంజన్ విమర్శించారు.

పంజాబ్‌లో అమృత్ పాల్ సింగ్ కోసం వేట కొనసాగుతోంది. అమృత్ పాల్ సన్నిహితులు పోలీసుల అదుపులో ఉన్నారు. రేపటి వరకు ఇంటర్నెట్ సర్వీసుల రద్దును పంజాబ్ ప్రభుత్వం పొడిగించింది.

యూపీలో ఉమేష్‌ పాల్‌ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మమ్మద్‌ గులామ్‌ మహ్మద్‌ ఇంటిని.. ప్రయాగ్‌రాజ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ బృందం… జేసీబీలతో నేలమట్టం చేసింది. ప్రస్తుతం గులామ్‌ మహ్మద్‌ పరారీలో ఉన్నారు.

రాంలీలా మైదాన్‌లో ‘కిసాన్ మహాపంచాయత్’ జరుగుతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన రైతులు సభకు హాజరయ్యారు. MSPపై చట్టం చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు మెయిల్ రావడంతో.. ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. కొన్ని రోజులపాటు ఎక్కడికి వెళ్లొద్దని సల్మాన్ ఖాన్‌కు పోలీసులు సూచించారు.

ఈ నెల 22న ఉగాది సందర్భంగా.. ఈనెల 21, 22 తేదీల్లో VIP బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లును TTD పూర్తి చేసింది.

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ వన్ వెబ్ ఇండియా-2 లాంచ్ కు ముహర్తం ఫిక్స్ అయింది. శ్రీహరికోటలోని షార్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఈనెల 26 ఉదయం 9 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో తెలిపింది.

Related News

JANASENA vs TDP: ఆ ఎన్నికతో పిఠాపురంలో సీన్ రివర్స్ అయిందా.. జనసేన వర్సెస్ టీడీపీ.. ఏం జరుగుతోంది?

AP Elections: ఏపీలో ఎన్నికలు.. అప్పుడే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ..

TTD Ex Chairman: చంద్రబాబుపై శివాలెత్తిన భూమన.. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్

Nagababu Comments: ఆ ఒక్క మాటతో జగన్, ప్రకాష్ రాజ్‌ల పరువు తీసేసిన నాగబాబు.. అందుకే పవన్ అలా స్పందించారట!

Tirumala: దసరాకు తిరుమల వెళ్తున్నారా.. దర్శనం టికెట్ లేకున్నా.. ఇలా చేస్తే శ్రీవారిని దర్శించవచ్చు

Janasena: సీఎం సీటుపై పవన్ ఫోకస్.. ప్లాన్-బి అమలు చేసే పనిలో జనసేనాని?

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Big Stories

×