EPAPER

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Minister Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి మాత్రమే కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు ఈ విషయమై సమావేశాలు నిర్వహించారు. ఇవాళ నాలుగో సారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు.


జలసౌధలో ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మరోసారి సమావేశం కావాల్సి ఉన్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. గత పదేళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నామమాత్రంగా రేషన్ కార్డులు ఇచ్చారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో మొత్తం 49,476 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. అవి కూడా ఉపఎన్నికలు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే జారీ చేశారని పేర్కొన్నారు. ఒక సిస్టమేటిక్‌గా ఎక్కడా రేషన్ కార్డులను ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు.

Also Read: Rajiv Gandhi: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి


తమ ప్రభుత్వ హయాంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 21వ తేదీన మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వివరించారు. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. రేషన్ కార్డులు, హెల్త్  కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దరఖాస్తులు స్వీకరించాక.. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల, కొత్తగా వచ్చిన దరఖాస్తులను ఎలా పరిగణనలోకి తీసుకోవాలని? రేషన్ కార్డుల జారీకి ఎలాంటి ప్రక్రియ అవలంబించాలనే అంశాలపై వచ్చే మీటింగ్‌లో చర్చిస్తామని తెలిపారు. ఖరీఫ్ నుంచి సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌గా ఇస్తామని చెప్పారు. ఇక జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తామని వెల్లడించారు.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×