EPAPER

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Nara Brahmani: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు స్కిల్ యూనిర్సిటీ బోర్డుతో నిర్వహించిన కీలక భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, మంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తళుక్కుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్ యూనివర్సిటీ బోర్డు మీటింగ్‌లో నారా బ్రాహ్మణి ప్రత్యక్షమవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ భేటీతో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఏవైనా బాధ్యతలను ఆమెకు అప్పగిస్తున్నారా? తెలంగాణలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారా? అనే చర్చ మొదలైంది.


ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణలోనూ పార్టీని పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు భావించారు. అదే సందర్భంలో తెలంగాణ టీడీపీ శాఖ బాధ్యతలు కోడలు నారా బ్రాహ్మణికి అప్పగిస్తారనే టాక్ కొన్నాళ్లు నడిచింది.

నారా బ్రాహ్మణి ఏది చేపట్టినా సక్సెస్ రేట్ ఎక్కువ. ఆమె హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ సంస్థ లాభాలు కురిపించింది. తెలంగాణలోనూ లాభాలు వస్తున్నాయి. యంగ్ లీడర్‌గా ఆమె కంపెనీని ముందుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే యువతకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక బాధ్యతలను నారా బ్రాహ్మణికి అప్పగిస్తారా? అందుకే ఆమె ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారా? అనే చర్చ జరుగుతన్నది. ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావించాల్సి ఉన్నది.


Also Read: Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు మీటింగ్‌లో మంత్రులు, వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్ శ్రీని రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితోపాటు వివిధ రంగాల్లో సక్సెస్‌ఫుల్‌గా ఉన్న పారిశ్రామిక వేత్తలు కూడా పాల్గొన్నారు. సక్సెస్‌ఫుల్ పారిశ్రామిక వేత్తగా నారా బ్రాహ్మణి ఈ మీటింగ్‌లో పాల్గొన్నారా? లేక వర్సిటీ బాధ్యతల్లో కొన్నింటిని ఆమెకు అప్పగించే క్రమంలో పాల్గొన్నారా? అనేది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న.

ఇక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ విషయానికి వస్తే.. యువతలో నైపుణ్యాలు పెంపొందించి, ప్రపంచ శ్రేణి నైపుణ్యవంతులుగా యువతను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆలోచన చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద 57 ఎకరాల స్థలంలో ఈ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ, నిర్మాణం పూర్తయ్యే సరికి ఒక విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఆలోచనతో తాత్కాలికంగా నిథమ్‌లో స్కిల్ యూనివర్సిటీని నడిపించాలని నిర్ణయించారు. ఈ ఏడాదికి ఆరు కోర్సులను ఈ తాత్కాలిక కాలేజీలో స్కిల్ యూనివర్సిటీ అందించనుంది. వాస్తవానికి మొత్తం 20 కోర్సులను ప్రారంభించాలని తొలుత అనుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో కోర్సులను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అందించనుంది.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×