EPAPER

Musi River : మూసీ నిర్వాసితులకు సర్కారు చేయూత

Musi River : మూసీ నిర్వాసితులకు సర్కారు చేయూత

Musi River : మూసీపై ఎన్ని విమర్శలు వచ్చినా అభివృద్ధితోనే సమాధానం చెప్తామని అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిర్వాసితులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతానికి చెందిన మహిళలు స్వయం సహాయక సంఘాలుగా మార్చింది. ఆ వెంటనే, ప్రజా భవన్‌లో వారికి ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. అలాగే, ఎంఐఎం ఎమ్మెల్యేలు బలాలా, కౌసర్ మోయినుద్దీన్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.


ఆర్థిక సాయంతో పురోగతి

మూసీ పరివాహక స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు షిఫ్ట్ అయిన మహిళలకు, మంత్రి సీతక్క చెక్కులు పంపిణీ చేశారు. 17 స్వయం సహాయక సంఘాల్లోని 172 మంది మహిళలకు రూ.3.44 కోట్ల చెక్కులు అందించారు. పది మంది సభ్యులతో ఒక్కో గ్రూప్ ఏర్పాటు కాగా, స్త్రీ నిధి ద్వారా వడ్డీ లేని రుణాలను రూ.20 లక్షల చొప్పున అందించింది ప్రభుత్వం. పిల్లిగుడిసెలు, ప్రతాప్ సింగారం, వనస్థలిపురం, నార్సింగి, జియాగూడ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ళకి షిఫ్ట్ అయిన మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూరింది. ఇప్పటివరకు 286 కుటుంబాలను డబుల్ బెడ్రూంలలోకి షిఫ్ట్ చేశారు. అక్కడివారికి ఆర్థిక సాయంతోపాటు, పిల్లలను గురుకులాల్లో అడ్మిట్ చేసి ఉచిత విద్య అందిస్తోంది ప్రభుత్వం. కొత్త ప్రాంతాల్లో సెటిల్ అయిన 40 మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించింది. 24 మంది చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో జాయిన్ చేసింది.


ALSO READ:హ్యాకర్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చే యూట్యూబ్ కొత్త టూల్.. ఒక్క క్లిక్ తో అకౌంట్ సేఫ్

అన్నివిధాలా అండగా ఉంటాం

మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు బాధ ఉంటుందని అన్నారు. కానీ, వాస్తవాలను గమనించాలని, వరదల్లో చెన్నై పరిస్థితి ఎలా ఉందో విశ్లేషించుకోవాలని సూచించారు. ‘‘మొన్న ఖమ్మం మునిగింది. వాళ్ళు సర్వం కోల్పోయారు. మూసీ మురికి నీరు వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనం పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి ఉండాలి. ఆ గాలిలో విషవాయువు ఉంటే రోగాల బారిన పడక తప్పదు. రాబోయే రోజుల్లో మూసీ నీళ్ళతో స్నానాలు చేసే పరిస్థితి రావాలి. బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది’’ అని అన్నారు. ఆర్థిక సాయంతోపాటు 17 రకాల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కుట్టు మెషిన్లు కూడా ఇవ్వబోతున్నామని, విద్యార్థులకు పాఠశాలల్లో ఫ్రీ అడ్మిషన్లు ఇస్తున్నామని తెలిపారు.

వరదొస్తే వణుకే

మూసీ ఎప్పుడు పొంగినా మసీదుల్లో తలదాచుకునే పరిస్థితి ఉండేదని ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా అన్నారు. తాగునీటి సమస్య విపరీతంగా ఉండేదని, తాను వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. మూసీ నిర్వాసితులకు ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇల్లు, రూ.2 లక్షల రుణం ఇవ్వడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు తీసుకున్న లోన్ 30 శాతం కడితే సరిపోతుందని చెప్పారు. మహిళలకి కుట్టు మెషిన్లు త్వరగా ఇవ్వాలని కోరారు.

Related News

Lady Aghori Naga Sadhu: మహిళా అఘోరితో ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. సంచలన విషయాలు!

Musi river : మూసీకి జలకళ సాధ్యమే..

Congress : ఆన్‌లైన్ డ్రామారావు కేటీఆర్ – చామల కిరణ్ కుమార్ రెడ్డి

Hyderabad: మియాపూర్‌లో చిరుత సంచారం.. హైదరాబాద్ వాసుల్లో భయం భయం!

Mallanna Sagar : మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరిగిందా? హరీష్ రావు మాటల్లో నిజమెంత!

KTR court issue : ఇదేం పద్ధతి? కేటీఆర్‌పై నాంపల్లి క్రిమినల్ కోర్టు అసహనం

Big Stories

×