EPAPER

MP Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలపై విరుచుకుపడిన బండి సంజయ్

MP Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలపై విరుచుకుపడిన బండి సంజయ్

MP Bandi Sanjay about BRS and Congress(Telangana politics): బీఆర్ఎస్ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ అవినీతి పార్టీ అని, ఈ రెండు పార్టీలకు బీజేపీ దూరం ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌లను ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం అవుతుందన్నారు. అందుకే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారన్నారు.


కాంగ్రెస్ పార్టీ విలీన నాటకం ఆడుతోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు జోడి బాగా కలుస్తుందని ఎంపీ బండి సంజయ్ అన్నారు.  కాంగ్రెస్ పార్టీలో సీఎం కావాలని ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాట ముచ్చట అయిపోయాయని వెల్లడించారు.

కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్ తోనే మొదలైందని, అందుకే బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్నారు. కేటీఆర్ ఎక్కడ కాకుండా అవుతారని ఎద్దేవా చేశావరు. బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేదని, ప్రజల మద్దతు ఉంటే చాలన్నారు.


రుణమాఫీపై రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.  అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ  రూ.లక్ష మాఫీ చేస్తామని చేయలేదని, తర్వాత కాంగ్రెస్ పార్టీ రూ.2లక్షల వరకు మాఫీ చేస్తామని చేయలేదని బండి సంజయ్ ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా రెండు పార్టీలు నాటకాలు ఆడాయన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు.

Also Read: బిగుస్తున్న ఉచ్చు.. కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు

రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందన్నారు. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే..కేవలం 22లక్షలమందికే రుణమాఫీ చేశారన్నారు. ఇక, ఆసరా పింఛన్, ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×