EPAPER

Mother and daughter Fights with Thieves: తలకు తుపాకీ గురి, పీకపై కత్తి.. దుండగులను ఎదుర్కొన్న శివంగులు!

Mother and daughter Fights with Thieves: తలకు తుపాకీ గురి, పీకపై కత్తి.. దుండగులను ఎదుర్కొన్న శివంగులు!


Mother and Daughter Fights with Thieves: వారి ధైర్య సాహసాలను పోలీసులు మెచ్చుకున్నారు. దొంగలను, వారి చేతుల్లో ఉన్న తుపాకులను చూసి బెదరకుండా.. ధైర్యంగా ఎదిరించారు. శివంగుల్లా తరిమికొట్టారు. ఆ తల్లీ కూతురిని చూసిన దొంగలు తోకముడిచి పరారయ్యారు. బెంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్ పుర జైన్ కాలనీలో గురువారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన. దీనిపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రసూల్ పురలోని పైగా హౌసింగ్ కాలనీలో నవరతన్ జైన్, భార్య అమిత మేహోత్, కుమార్తె ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం అమిత, కుమార్తె, పనిమిషి మాత్రమే ఇంట్లో ఉన్నారు. 2.15 గంటల సమయంలో.. కొరియర్ సర్వీస్ వచ్చిందంటూ.. ప్రేమ్ చంద్, సుశీల్ కుమార్ ఆ ఇంటి ప్రాంగణంలోకి వచ్చారు. బయటే ఉండాలని అమిత చెప్పినా వినకుండా.. హెల్మెట్ పెట్టుకుని ఉన్న సుశీల్.. ఇంట్లోకి ప్రవేశించి తన బ్యాగులో ఉన్న నాటు తుపాకీని తీసి గురిపెట్టాడు. ప్రేమ్ చంద్ కిచెన్ లోకి వెళ్లి పనిమనిషిని కత్తితో బెదిరించి.. విలువైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


ఇంతలో అమిత.. తన సాయశక్తులు ఒడ్డి సుశీల్ ను కాలితో నెట్టేసింది. కుమార్తె కూడా తల్లికి తోడుగా రావడంతో.. ఇద్దరూ కలిసి వారిపై పోరాడారు. సుశీల్ తల్లి, కుమార్తెపై దాడి చేస్తున్నా భయపడకుండా గట్టిగా కేకలేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అతను తుపాకీని అక్కడే వదిలి పారిపోయాడు. అమిత, కుమార్తెల కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకోగా.. పనిమనిషిని బెదిరించిన ప్రేమ్ చంద్.. అదే కత్తిని అందరికీ చూపించి పారిపోయే ప్రయత్నం చేశాడు. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. పారిపోయిన సుశీల్ ను కాజీపేటలో అరెస్ట్ చేశారు.

Also Read : రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్.. రూ. కోటి విలువైన కారు స్వాధీనం..

ఈ ఘటనపై బాధితురాలు అమిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఏడాది క్రితమే వీరిద్దరూ అమిత ఇంటికి పనికావాలని వచ్చి.. కొంతకాలం పనిచేశారు. ఏయే వస్తువులు ఎక్కడుంటాయో అంతా గమనించాక.. ఉన్నట్టుండి పని మానేసి వెళ్లిపోయారు. ఇప్పుడు పక్కా ప్లాన్ తో అమిత ఇంట్లో దోపిడీకి వచ్చారని తెలుస్తోంది. ఇదంతా అమిత ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డవ్వగా.. పోలీసులు దానిని సేకరించారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదేమైనా తుపాకీ గురిపెట్టినా, పీకమీద కత్తి పెట్టినా వెరవకుండా వారిని ఎదిరించిన ఈ తల్లీకూతుర్ల ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.

Tags

Related News

BRS Party: ఓరుగల్లులో కారు ఖాళీ అయినట్లేనా?

TSPSC Group -1: వాయిదాల జాతర.. తెరవెనుక ఉన్నదెవరు.. అడ్డుపడుతున్నదెవరు?

Musi Riverfront Document: మూసీ నది పునరుజ్జీవనం.. ఆపై హైదరాబాద్‌కు పునరుత్తేజం

Revanth On Musi River: సీఎంతో జాగ్రత్త.. నేతలతో కేసీఆర్ మంతనాలు..!

Anvitha Builders : అన్విత… నమ్మితే అంతే ఇక..!

BRS Working President Ktr : మంత్రి కొండా సురేఖ కేసులో రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్, వాంగ్మూలాలు తీసుకోనున్న న్యాయస్థానం

Kcr Medigadda : మరోసారి కోర్టుకు కేసీఆర్ డుమ్మా.. న్యాయపోరాటం ఆగదన్న పిటిషనర్

Big Stories

×