EPAPER

BJP MLA: బడా కబ్జాల సంగతేంటి..? ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి సవాల్

BJP MLA: బడా కబ్జాల సంగతేంటి..? ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి సవాల్

హైదరాబాద్, స్వేచ్ఛ: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాతో హైడ్రాతో జనం సతమతమవుతున్నారని, పేదల పొట్టగొట్టడం ప్రజా క్షేమం అవుతుందా? అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైడ్రాపై 190 పేజీల రిపోర్ట్ ఇచ్చారని, ఆయన ప్రజెంటేషన్‌ క్లారిటీగా లేదని విమర్శించారు. 20 గుంటలు, 30 గుంటలు తప్ప, ఎకరాల్లో ఆక్రమణలకు గురయిన చెరువులు, కుంటల లెక్కలు భట్టికి కనిపించడం లేదా అంటూ నిలదీశారు. నగరంలో చాలా ఏరియాల్లో చెరువులు మాయం అయ్యాయినేది ఉప ముఖ్యమంత్రికి తెలియదా అని అడిగారు. కబ్జాకు గురయ్యాయనేది మాత్రమే చెబుతున్నారని, ఎవరు చేశారో చెప్పడం లేదని మండిపడ్డారు. అందుకే వాస్తవాలతో తాను ఓ లిస్ట్‌ను బయట పెడుతున్నట్టు చెప్పారు. చెరువుల ఆక్రమణలపై తన వ్యాఖ్యలు తప్పు అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.


బీఆర్ఎస్ తప్పే కాంగ్రెస్‌లో రిపీట్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందన్న వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్ సర్కార్ కూడా అదే తప్పు చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో చెరువులను సెజ్‌లుగా మార్చి, ఫినిక్స్ స్కై ల్యాండ్ లాంటి కొన్ని నిర్మాణ కంపెనీలకు అప్పజెప్పారని అన్నారు. నార్సింగిలో 19 ఎకరాల కుంట ఫినిక్స్ స్కై ల్యాండ్ కంపెనీకి ఎలా అప్పజెప్పారని ప్రశ్నించారు. చెరువులో పెద్ద పెద్ద నిర్మాణాలు జరిగాయని, అవి భట్టి విక్రమార్కకు కనిపించడం లేదా అని నిలదీశారు.


Also Read: రాష్ట్రంలో ఈసారి బతుకమ్మ పండుగ జరుగుతున్నట్టే లేదు: కేటీఆర్

చెరువులు, కుంటల్లోని నిర్మాణాలు ఇవే

– ఎస్ఎంఆర్ కాసా కరీనో సంస్థ బండ్లగూడ జాగీర్ కుంట పరిధిలోని 1.49 ఎకరాల భూమిని కబ్జా చేసి విల్లాల నిర్మాణం చేపట్టింది. ఒక్కో రూ.10 విలువ ఉంటుంది.
– వజ్ర ఇగ్జోరా సంస్థ గోపన్ పల్లిలోని మెడ్లకుంట చెరువు మొత్తాన్ని కబ్జా చేసి 14 అంతస్తుల భవనాలను నిర్మించింది. ప్రాజెక్టు విలువ రూ.900 కోట్లు ఉంటుందని అంచనా.
– ఫినిక్స్ సంస్థ పుప్పాల గూడ చెరువు మొత్తం కబ్జా చేసేసి 30 అంతస్తుల భారీ కమర్షియల్ భవనం నిర్మాణం చేసింది.
– ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ సంస్థ ఉస్మాన్ కుంటలో 884 విల్లాలు నిర్మించింది.
– ప్రెస్టీజ్ కంపెనీ 98 ఎకరాల పెద్ద చెరువు భూమిలో 19 ఎకరాల భూమిని కబ్జా చేసి, మొత్తం రూ.5,400 కోట్ల ప్రాజెక్టుతో 41 అంతస్తుల భవనాలను నిర్మించింది.
– అలయన్స్ గ్రూప్ సంస్థ తెల్లాపూర్ చెరువును ఆక్రమించి విల్లాలు నిర్మించింది.

అప్పుడూ ఇప్పుడూ సేమ్

గత ప్రభుత్వంలో కేసీఆర్ ఆక్రమణల పేరుతో పైసల పాలన చూపించారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో ప్రజా పాలన అంటున్నారని వ్యాఖ్యానించారు రమణా రెడ్డి. సీఎంకు దమ్ముంటే తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. పేదల నిర్మాణాలను కూల్చుతున్న ప్రభుత్వం, బడా కంపెనీల ఆక్రమణలను కూలుస్తుందా? అని సవాల్ చేశారు. తాను పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నానని, ఇది తప్పు అని ప్రూవ్ చేస్తే అక్కడే సూసైడ్ చేసుకుంటానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. నగర చెరువుల్లో 30 కంపెనీలు చేపట్టిన నిర్మాణాలను కూల్చే దమ్ము ప్రజా ప్రభుత్వానికి ఉందా అని అడిగారు. తన దగ్గర మొత్తం డేటా ఉందని, పక్కా ఆధారాలున్నాయని చెప్పారు.

Related News

MRPS: మందకృష్ణ మాదిగ అరెస్ట్..

Corrupt wife: భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త.. ఏకంగా వీడియోలు రిలీజ్!

CM Revanth Reddy: రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. 48 గంటల్లోనే మీ అకౌంట్లోకి ఆ డబ్బులు..

Minister Ponnam: మీకు కడుపు మంట ఎందుకు..? కేటీఆర్‌కు పొన్నం కౌంటర్

KTR: రాష్ట్రంలో ఈసారి బతుకమ్మ పండుగ జరుగుతున్నట్టే లేదు: కేటీఆర్

CM Revanth Reddy: 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్.. ఆ తర్వాతే కొత్త ఉద్యోగ…

Big Stories

×