EPAPER

Minster Ponnam Comments: వర్షాలపై ప్రతిపక్షాలు మాట్లాడొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

Minster Ponnam Comments: వర్షాలపై ప్రతిపక్షాలు మాట్లాడొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

Minster Ponnam Comments amid Heavy Rainfall in Telangana: భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఎమ్మేల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి లోయర్ మానేర్ డ్యాంను ఆయన పరిశీలింతారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందునా రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. గత కొంత కాలంగా చెరువులు, కుంటలు నిండలేదని ఆందోళన పడుతున్న నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు , చెరువులు నిండుతున్నాయి. మరో రెండు రోజులు పాటు వర్షాలు కురవనున్నాయి. ఇళ్లలో నుంచి ప్రజలను ఖాళీ చేపించి, పునరావాస కేంద్రాలకు తరలించెంతగా పరిస్థితి జిల్లాలో ఎక్కడా లేదు. కోహడ్ – ముల్కనూరు, ఇళ్లంతకుంట తదితర ప్రాంతాల్లో రోడ్ల మీద నుండి వరద పోవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో మొదలైంది.. ఎల్ఎండీలో 24 టీఎంసీలకు ప్రస్తుతం 14 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మిడ్ మానేరుకు మోయ తుమ్మెద వాగు, మూల వాగు నుంచి వరద వస్తుంది. ఎల్లంపల్లి నుండి రోజువారీగా ఇప్పటికే నీటి విడుదల కొనసాగుతుంది. మిడ్ మానేరు, లోయర్ మానేరు, మల్లన్న సాగర్, రంగ నాయక సాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు ప్రాజెక్టులో నింపుకునే విధంగా వర్షాలు భారీగా పడుతున్నాయి. అటు కిందికి కోదాడ వరకు నీళ్లను అందించవచ్చు.


Also Read: ఖమ్మంలో కాపాడాలంటూ ఆర్తనాదాలు.. హెలిక్యాప్టర్ కావాలని ఫోన్ చేసిన భట్టి

కరీంనగర్ తోపాటు ఇతర మున్సిపాలిటీలలో ఎక్కడా లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లల్లోకి వచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నాం. అక్కడక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. అధికారులంతా క్షేత్ర స్థాయిలో వారి వారి కేంద్రాల్లో నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా అక్కడ అధికారులతో మాట్లాడా.. ఎక్కడా కూడా ఇబ్బంది లేదు.


హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులలో లెవెల్స్ నిండే పరిస్థితి ఉంది. కాళేశ్వరంలో టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నీటి నిల్వ కొనసాగుతున్నది. ఎల్లంపల్లి నుండి ప్రతి చుక్క ఉపయోగించుకునే విధంగా ప్రాజెక్టులలోకి నీటిని పంపిస్తాం. శ్రీరామ్ సాగర్ లో ప్రస్తుతం 64 టీఎంసీల నీరు ఉంది.. పూర్తి స్థాయి నిండగానే వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తాం. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Also Read: మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి కంటతడి

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో తమ్మడి హట్టి నుండి గుండెకాయ లాంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు నీళ్లు తీసుకొచ్చేది. ఆ నీరు మిడ్ మానేరు, రంగ నాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లకు తీసుకుపోయేది. ఇప్పుడు నీరు కిందికి వృథాగా పోతున్నాయి. రాబోయే కాలంలో వ్యవసాయం ఇబ్బందులు ఉండవు..ప్రతిపక్షాలు వ్యవసాయానికి ఇబ్బందులు ఉండడద్దని కోరుకోవాలి. ప్రతిపక్షాలు.. వర్షాలు, ప్రాజెక్టులు, వ్యవసాయం పేరు మీద రాజకీయాలు చేయొద్దు. సీఎం రేవంత్ రెడ్డి.. సీఎస్ ను ఆదేశించారు.. సీఎస్ కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

హైదరాబాద్ లాంటి వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. హైదరాబాద్ లో ఉన్న 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలి. రోడ్లపై వరద వెళ్తుంటే ద్విచక్ర వాహనాలకు కూడా అనుమతి ఇవ్వకూడదు. సిద్దిపేట – హనుమకొండ దారిలో కూడా వరద పోతుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు సహకరించాలి’ అంటూ మంత్రి పొన్నం పేర్కొన్నారు.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×