EPAPER

Medigadda Project : మేడిగడ్డకు మంత్రుల బృందం.. ప్రాజెక్టు పరిస్థితిపై అధ్యయనం..

Medigadda Project : మేడిగడ్డకు మంత్రుల బృందం.. ప్రాజెక్టు పరిస్థితిపై అధ్యయనం..
Medigadda Project news

Medigadda Project news(Political news in telangana):

కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రుల బృందం సందర్శనకు వెళ్లింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ వచ్చే వర్షాకాలంలోగా చేయడం ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో నలుగురు మంత్రులతో కూడిన బృందం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


ఈ బృందంలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఉన్నారు. అధికారులతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను వారు పరిశీలించి అధ్యయన చేస్తారు.

హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ లో మంత్రుల బృందం మేడిగడ్డకు చేరుకుంది. ప్రాజెక్టును పరిశీలించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కూడా చేస్తారు. పిల్లర్లు కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష చేస్తారు.


మేడిగడ్డ బ్యారేజ్ డామేజ్ అనేది మేజర్ ఇన్సిడెంట్ అని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం క్షమించరాని విషయమన్నారు.
లక్ష కోట్ల ప్రాజెక్టు మూడేళ్లలో కుంగిపోవటం అనేది సిగ్గుపడాల్సిన ఘటనని విమర్శించారు. బ్యారేజ్ సందర్శిన తర్వాత పూర్తి నివేదికను తయారు చేస్తామన్నారు.

మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ ను చిన్న తప్పుగా ఎన్నికల ముందు చూపించడం కరెక్ట్ కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూడట్లేదని స్పష్టంచేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లో మొత్తం నీటిని తీయాల్సి వస్తుందన్నారు. ఎస్సార్ ఎస్పీ స్టేజ్ -2 ఇప్పుడు మొత్తం దెబ్బతింటుందని వివరించారు. బాధ్యులు ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags

Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×