EPAPER

Seetharam Project: ప్రజాస్వామ్యంలో మీది మాది అనేది ఉండదు: హరీశ్ రావుకు మంత్రి తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

Seetharam Project: ప్రజాస్వామ్యంలో మీది మాది అనేది ఉండదు: హరీశ్ రావుకు మంత్రి తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

ఖమ్మం, స్వేచ్ఛ: ఇంకొన్ని గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఈమధ్యే సక్సెస్ ఫుల్‌గా ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే, ఈ క్రెడిట్ అంతా కేసీఆర్‌దేనని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం చూపిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రియాక్ట్ అయ్యారు.


సీతారామ సాగునీటి ప్రాజెక్ట్‌పై మంత్రి తుమ్మల మాట్లాడుతూ, భావోద్వేగానికి గురయ్యారు. ప్రజల రుణం తీర్చుకోవడం కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నానన్న తుమ్మల, తాను ఏ పార్టీలో పనిచేసినా వారి ఆలోచనలకు తగ్గట్టుగానే పనిచేసానని తెలిపారు. గత ఐదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలన అంతా నత్తనడకన సాగిందన్నారు. సీతారామ ప్రాజెక్ట్ క్రికెట్ దక్కాలంటే బీఆర్ఎస్ నేతలు ప్రారంభోత్సవం నాడు రావాలి. వారి నెత్తిన కూడా నీళ్ళు పోస్తానని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు తుమ్మల. గతంలో రెండు పంటలకు సాగర్ నీళ్ళు ఇవ్వని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. అధికారం లేకపోవడంతో ప్రతి విషయాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని, గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీ అని గొప్పలు చెప్పుకుని చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అది చేసి చూపించిందని అన్నారు.

Also Read: SEBI Chairman: 22న దేశవ్యాప్తంగా భారీ ఆందోళన కార్యక్రమం.. కాంగ్రెస్ కీలక నిర్ణయం


ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్న తుమ్మల, పక్కనే గోదావరి ఉన్నా వాడుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలనేదే తన సంకల్పంగా చెప్పుకొచ్చారు. ఆనాడు వైఎస్ హయాంలో ఇందిరా రాజీవ్ సాగర్ చేపట్టారని, వైఎస్ మరణంతో ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. తనను బీఆర్ఎస్‌లోకి రమ్మని ఆహ్వానించినప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ప్రతిపాదన పెట్టానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే నాడు కేసీఆర్ సీఎం హోదాలో శంకుస్థాపన చేశారని వివరించారు. రెండో సారి అధికారంలోకి వచ్చినపుడు కేవలం పంపు హౌజ్‌లకు మాత్రమే పరిమితం చేశారని, జూలూరు పాడు టన్నెల్ నిర్ణయం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు మంత్రిగా అవకాశం వచ్చిందని, మొదటి రోజే సత్తుపల్లి టన్నెల్ పనులు ప్రారంభించామని తెలిపారు. సీఎం, ఇరిగేషన్ మంత్రికి రిక్వెస్ట్ చేస్తే రాజీవ్ లింక్ కెనాల్ మంజూరు చేశారని, ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు భూములు ఇచ్చారని చెప్పారు. పంపు హౌజ్ మోటార్లు నాలుగు సంవత్సరాలుగా అలాగే ఉంచారని, హరీష్ రావు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు తుమ్మల. తనకు పదవులు ముఖ్యంగా కాదని భావోద్వేగానికి గురయ్యారు.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×