EPAPER

Minister Seethakka: మీ తండ్రి నేర్పిన సంస్కారం ఇదేనా?: కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్

Minister Seethakka: మీ తండ్రి నేర్పిన సంస్కారం ఇదేనా?: కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్

KTR Controversy: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళల గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారని మండిపడ్డారు. కేటీఆర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం, సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్సులు చేస్తున్నారా? ఆడవాళ్లంటే మీకు గౌరవం లేదు’ అంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.


కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అని, వెంటనే ఆయన బేషరతుగా తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఆడవాళ్లను అవమానించేలా బ్రేక్ డాన్సులు చేసుకోండని అనడం ఆయన బుర్రలో ఉన్న బురదకు నిదర్శమని విమర్శించారు. గత పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో క్లబ్‌లు, పబ్‌లు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర వాళ్లదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు ఆర్థికంగా ఎదగాలని, సాధికారత సాధించాలనే లక్ష్యంతో వారి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. అందులో భాగంగానే పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించడానికి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

శ్రమ జీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో టైం వేస్ట్ చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటని మంత్రి సీతక్క నిలదీశారు. అంతమాత్రానా వారిని బ్రేక్ డాన్సులు వేసుకోమని అంటారా? ఇది దుర్మార్గమన్నారు. రాష్ట్ర మహిళలను బ్రేక్ డాన్సులు చేసుకోమనండనే మాటలు నోటికి ఎలా వచ్చాయి కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. అంతటి ధైర్యం ఎలా వచ్చిందనీ ఆగ్రహించారు. తెలంగాణ మహిళలకు కేటీఆర్, బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


Also Read: Free RTC Bus Journey: మహిళలపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు

ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలు చేస్తే వారికి నచ్చడం లేదని, పోనీ గత పదేళ్లలో ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన వారికి తట్టనేలేదని మంత్రి సీతక్క విమర్శించారు. అలాంటి మంచి పథకాన్ని తాము అమలు చేస్తే దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. కేటీఆర్ తక్షణమే బహిరంగంగా మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్‌పై మహిళల ఆగ్రహం

కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను గౌరవించే సంస్కృతి బీఆర్‌ఎస్‌లో లేకపోగా, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వెంటనే, కేటీఆర్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గత పదేళ్లలో మహిళలు ఎన్నో అవమానాలు పడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు మహిళా సంఘాల నేతలు.

రవాణా మంత్రి స్పందన

మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యాన్ని కల్పించడం జీర్ణించుకోలేని కేటీఆర్ తెలంగాణలోని అక్క చెల్లెమ్మలపై ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు రికార్డ్ డ్యాన్సులు చేసుకోవాలని అవమాన పరిచారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్‌లు కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అవమానపరిచేలా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు.

Related News

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Big Stories

×