EPAPER

Minister Ponnam Prabhakar: ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనాలకు నో పర్మిషన్.. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు వరకే పరిమితం!

Minister Ponnam Prabhakar: ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనాలకు నో పర్మిషన్.. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు వరకే పరిమితం!

నిమజ్జనం.. సాఫీగా!


– గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు
– ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనాలకు నో పర్మిషన్
– ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు వరకే పరిమితం
– రూల్స్ మీరొద్దన్న సీపీ సీవీ ఆనంద్
– రాజకీయాలకు ఇది టైమ్ కాదని మంత్రి పొన్నం వార్నింగ్

Ganesh Immersion: గణేష్ నిమజ్జనానికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు వెళ్లాయి. ఇంకోవైపు మిలాద్ ఉన్ నబీ ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తుకు ప్లాన్ చేశారు. ఇదే క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, గణేష్ నిమజ్జనాల సందర్భంగా రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాల టైంలో మూడు కమిషనరేట్ల పరిధిలో రాజకీయాలు మానుకోవాలన్నారు. హిందూ, ముస్లిం పండుగలు వరుసగా వచ్చిన సందర్భంలో రాజకీయాలు చేయొద్దని, గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగాలనేది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. రెచ్చగొట్టే విధంగా ఎవరు మాట్లిడినా చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సంఘ విద్రోహ చర్యల మీద కఠినంగా ఉండాలని ఇప్పటికే సీఎం ఆదేశించారని, గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు పొన్నం.


ట్యాంక్ బండ్‌ దగ్గర నిమజ్జనం లేనట్టే!

హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం లేదని స్పష్టం చేశారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో మాత్రమే హుస్సేన్ సాగర్ పరిధిలో నిమజ్జనం జరుగుతుందని స్పష్టం చేశారు. స్ట్రీట్ లెవల్‌లో బందోబస్తు నిర్వహిస్తున్నామని, గణేష్ ఉత్సవాల నిర్వాహకుల సహకారం అవసరం ఉందన్నారు. మొదటి ఫేజ్‌లో 3000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఇప్పుడు రెండో ఫేజ్‌లోకి వెళ్తున్నామని, 8000 మందితో ఫోర్స్ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మిలాద్ ఉన్ నబీ కూడా ఉన్న నేపథ్యంలో, మత పెద్దలతో కూడా మాట్లాడామని, వారు సహకరిస్తామని చెప్పినట్టు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, మొత్తంగా 25,000 మందితో బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు సీపీ.

Also Read: MLA Kaushik Reddy: కారు రెండు ముక్కలైందా? కౌశిక్ ‘ప్రాంతీయ’ మాట ఎవరిది?

నిమజ్జనం నిబంధనలు ఇవే!

– విగ్రహం ఉన్న ఒక్క వాహనానికే ఎంట్రీ
– విగ్రహం ఉన్న వాహనంపై లౌడ్ స్పీకర్‌కు అనుమతి లేదు
– డీజేతో కూడిన మ్యూజిక్ ఉండకూడదు
– రంగులకు వాడే కాన్ఫెట్టీ గన్‌లను వాడకూడదు
– విగ్రహం ఉన్న వాహనంపై మందుబాబులు, మత్తుబాబులు ఉండకూడదు
– ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకూడదు
– పోలీసులు ఇచ్చే ఆదేశాలను బట్టి వాహనాల రూట్ మ్యాప్ ఉంటుంది
– ఎవరూ స్టిక్స్, మారణాయుధాలు, మండే వాటిని తీసుకెళ్లకూడదు
– బాణాసంచా కాల్చడానికి వీలు లేదు
– రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు చేయకూడదు

Related News

Hydra Bulldozers Ready: మూసీ ఆక్రమణలు.. రెడీగా హైడ్రా బుల్డోజర్లు, ఇప్పటికే నోటీసులు.. రేపోమాపో

Harish Rao: అబద్ధాల కాంగ్రెస్: హరీష్ రావు ఆగ్రహం

Hydra: బ్రేకింగ్ న్యూస్.. సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన హైడ్రా కమిషనర్.. ఇక కూల్చివేతలు ఆగనున్నాయా?

CM Revanth Reddy: హైడ్రా ఆగదు.. ఆ పెత్తనం సాగదు: సీఎం రేవంత్

Rajiv Gandhi statue: రాజీవ్ గాంధీ విగ్రహంపై బీఆర్ఎస్ రాద్ధాంతం ఎందుకు? కేటీఆర్ అంత మాటెందుకు అన్నాడు?

Telangana Liberation Day: పాలనే లేదు.. ప్రజా పాలన దినోత్సవమేంటీ?: కేటీఆర్ విసుర్లు

Khairtabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం పూర్తి.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

Big Stories

×