EPAPER

Ponnam Angry On Ktr: కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిందెవరు?

Ponnam Angry On Ktr: కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిందెవరు?

Ponnam Angry On Ktr: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయా? ఎమ్మెల్యే గాంధీని పార్టీ నుంచి పంపించేందుకు బీఆర్ఎస్ స్కెచ్ వేసిందా? ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా ప్లాన్ చేసిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేనన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై ఆ పార్టీ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన రచ్చ కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో కౌశిక్‌రెడ్డికి బీఆర్ఎస్ పెద్దలు సపోర్టు ఇచ్చినట్టు కనిపిస్తోంది. కౌశిక్‌రెడ్డి లేవనెత్తిన ప్రాంతీయవాదం కరెక్టేనని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది.

ఈ వ్యవహారంపై శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారాయన. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్ సభ్యులు కాదా అంటూ ప్రశ్నించారు.


హైదరాబాద్‌లో నివసించే వారిని తాము ఏనాడూ విమర్శించలేదన్నారు మంత్రి. అత్యంత దారుణంగా ఆంద్రా ప్రజలను విమర్శించింది కేసీఆర్ కాగా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని ఆ పార్టీ నేత గాంధీ చెబుతున్నారని తెలిపారు.

ALSO READ:  ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.. న్యూ ట్విస్ట్, హత్యాయత్నం కేసు

ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలా నియంతృత్వ పోకడలు తాము పోలేదన్నారు. గాంధీ- కౌశిక్ చేసింది ముమ్మాటికీ తప్పేనని అన్నారు. కానీ, కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం కరెక్టా, భౌతిక దాడులు మంచివి కావన్నారు. బీఆర్ఎస్ నేతలను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి‌పై అనవసర విమర్శలు చేసే సహించేది లేదన్నారు. చిల్లరగాళ్ళను పట్టించుకోవద్దని సీఎం చెప్పడంతో సైలెంట్‌గా ఉన్నామన్నారు.

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను చెడ్డగొట్టాలని బీఆర్‌ఎస్‌ నేతలు చూస్తున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్‌ను ఎవరైనా పనికిమాలిన వారని అంటే సహించేది లేదన్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకు కోస్తామని హెచ్చిరించారు. హైదరాబాద్‌ ప్రజల మూడ్‌ను బీఆర్‌ఎస్‌ నేతలు కరాబ్ చేశారన్నారు. గాంధీ-కౌశిక్‌రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారమంటూ ధ్వజమెత్తారు.

శనివారం హైదరాబాద్ వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నేరుగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. కౌశిక్ ఎలా ఉన్నావంటూ కేటీఆర్ ఆత్మీయంగా పలకించారు. ఆయనను ఆలింగనం చేసుకున్న కేటీఆర్, టైగర్ అంటూ సంబోధించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కేటీఆర్. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అదుపులో ఉంచలేకపోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కాంగ్రెస్ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. సిటీలో ఒక్క సీటు రాలేదని భావించి ప్రజలపై పగబట్టారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో సీఎంపై నోరుపారేసుకున్నారాయన.

 

Related News

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Bandi Sanjay: ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి వదిలేస్తున్నా.. ఇంకోసారి వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటే ఊరుకోను: బండి సంజయ్

Kavitha: కవిత మౌనమేల.. దూరం పెట్టారా.. ఉంచారా..?

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Big Stories

×