EPAPER

Ponguleti: చింతమడకలో ఇళ్లు కూల్చేసిన కేసీఆర్.. మేం నిర్మాణాలు పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి

Ponguleti: చింతమడకలో ఇళ్లు కూల్చేసిన కేసీఆర్.. మేం నిర్మాణాలు పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి

Double Bed Room: రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన స్వగ్రామం చింతమడకలో ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి వారి ఇళ్లు కూల్చేశాడని, తీరా చూస్తే వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని మంత్రి తెలిపారు. సొంత ఊరోళ్లకే పంగనామాలు పెట్టి నిలువ నీడ లేకుండా చేశారని పేర్కొన్నారు. ఉన్న ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా కేసీఆర్ పనితనం సాగిందని విమర్శించారు. కేసీఆర్ స్వగ్రామం అని చింతమడకను తాము నిర్లక్ష్యం చేయబోమని, భేషజాలకు పోబోమని స్పష్టం చేశారు.


‘చింతమడకలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మిస్తామని 2019 జులై 22వ తేదీన కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటన చేశారు. ఆయన మాటలు నమ్మి ప్రజలు తమ ఇళ్లు, గుడిసెలను అక్కడి నిరుపేదలు ప్రభుత్వానికి అప్పగించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం వాటిని కూల్చేశారు. లబ్దిదారులను గుర్తించి 1909 ఇళ్లను అధికారులు మంజూరు చేశారు. కానీ, 1215 ఇళ్లను నిర్మించడానికే కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకున్నారు. 694 ఇళ్లకు అగ్రిమెంటే జరగలేదు, నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. గతేడాది డిసెంబర్ నాటికి నాలుగేళ్ల కాలంలో 1103 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. దీంతో ఉన్న ఇళ్లు, గుడిసె కూడా కోల్పోయినవారు నిలువ నీడ లేకుండా మారిపోయారు. కొందరు పొలాల వద్ద గుడిసెలు వేసుకుంటే మరికొందరు వలసలు పోయారు’ అని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను, ఆశలను బీఆర్ఎస్ నేతలు రాజకీయ అవసరాలకు వాడుకున్నారని, ఇందుకు కేసీఆర్ స్వగ్రామమే నిదర్శనం అని మండిపడ్డారు.

Also Read: Madhuri Challenge : “దమ్ముంటే డీఎన్ఏ టెస్ట్ చేయించు”.. దువ్వాడ వాణికి మాధురి సవాల్


ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే ఇందిరమ్మ రాజ్యమని, ముఖ్యంగా పేదవాడికి సొంత ఇల్లు ఒక కల అని, ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు పూర్తి న్యాయం జరుగుతుందని మంత్రి పొంగులేటి వివరించారు. ప్రతి వ్యక్తికి మేలు చేయడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, లక్ష్యం అని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్నారని, పేదలకు మాత్రం ఇంటి సౌకర్యాన్ని విస్మరించారని చెప్పారు. కానీ, తాము వారందరికీ కూడా నివాస వసతిని కల్పిస్తున్నామని, ఇది ప్రజా ప్రభుత్వమని, తక్షణమే చింతమడకలో అధికారుల పర్యటించి ఇళ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్వరగా అక్కడ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×