EPAPER

Ponguleti: త్వరలోనే ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి పొంగులేటి

Ponguleti: త్వరలోనే ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి పొంగులేటి

Minister Ponguleti Srinivas Reddy Comments: త్వరలోనే ఆర్ఓఆర్ చట్టం 2024 చట్టం తీసుకరాబోతున్నామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆయన రాష్ట్రంలోని డిప్యూటీ కలెక్టర్లు, 257 రెవెన్యూ డిపార్ట్ మెంట్ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వారికి పలు సూచనలు చేశారు. ‘970 ఎమ్మార్వోలతో సమావేశం కూడా అయ్యాం. రాబోయే కొద్ది రోజుల్లో ఆర్ఓఆర్ చట్టం- 2024 చట్టాన్ని తీసుకురాబోతున్నాం.


Also Read: కేసీఆర్ కనిపించడం లేదంటూ.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. ఫిర్యాదు చేసింది ఎవరంటే ?

గత 10 ఏళ్లుగా అనేకమంది భూమి ఉన్న రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ చట్టం దేశంలో ఆదర్శంగా ఉండబోతుంది. అధికారుల సూచనలు తీసుకుంటున్నాం. 10,900 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి రెవెన్యూ విలేజ్ కి రెవెన్యూ అధికారిని నియమించాలని అధికారులు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యి ఇంకా అనేక అంశాలపై చర్చిస్తాం. కొత్త మండలాలను, కొత్త జిల్లాలను అనౌన్స్ చేశారు. కానీ వాటికి కనీసం ఆఫీసులు లేవు. వాటికి ఆఫీసులను ఆర్థిక వెసులుబాటును చూసుకుని ఏర్పాటు చేయబోతున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆర్ఓఆర్ చట్టం-2024 తీసుకురాబోతున్నాం. భూములు ఉన్న ప్రతి ఒక్క ఆసామికి భరోసా ఇవ్వాలనేదే మా ఆలోచన. మంచి పాలన రాబోయే రోజుల్లో అందిస్తాం.


గతంలో గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్వో, గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్‌ఏ వ్యవస్థలు కలిపి రాష్ట్రంలో 25 వేలకు పైగా పోస్టులు ఉండేవని, బీఆర్​ఎస్​ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేయగా.. వారిని ఇతర శాఖలకు బదలాయించిందని, ఫలితంగా గ్రామస్థాయిలో అనేక సమస్యలు ఎదురైనట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు కాపాడడానికి రెవెన్యూ అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి రెవెన్యూ శాఖనే కళ్ళు, చెవులు అని, సాధారణ ప్రజలకు, రైతులకు సత్వర, జవాబుదారిగా రెవెన్యూ సేవలు అందించాలని అయన రెవెన్యూ అధికారులకు సూచించారు’ అంటూ మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

Also Read: సామాన్యుడిపై మరో భారం.. సెంచరీ చేరువలో ఉల్లి, టమాట

ఎన్నికల ప్రక్రియలో భాగంగా గతంలో బదిలీ అయిన తహసీల్దార్లు ఇతర జిల్లాలో పనిచేస్తున్నారని, కానీ,.. వారి కుటుంబాలు మాత్రం పూర్వపు జిల్లాలలోనే ఉంటున్నారని, దీనివల్ల పిల్లల చదువు, పెద్దల చికిత్స తదితర విషయాలలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఉద్యోగులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ, ఈ సమావేశానికి హాజరైన రెవెన్యూ ముఖ్యకార్యదర్శి మరియు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌కు ఆదేశాలిచ్చారు. రెండు మూడు రోజుల్లో రెవెన్యూ ఉద్యోగుల సంఘాలతో మాట్లాడి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. వీలుంటే దసరా లోపే తహశీల్దార్ల బదిలీలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Related News

Etela: సీఎం రేవంత్ రెడ్డికి ఈటల లేఖ.. హైడ్రాకు వ్యతిరేకం కాదంటూ…

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

CM Revanth Reddy: ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం: సీఎం రేవంత్ రెడ్డి

Derogatory Comments: బూతులపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు సేవ చేయడంపై లేదా..?

KCR: కేసీఆర్ కనిపించడం లేదంటూ.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. ఫిర్యాదు చేసింది ఎవరంటే ?

Secunderabad To Goa Trains: సికింద్రాబాద్ టూ గోవా రైలును ప్రారంభించిన కిషన్ రెడ్డి

×