EPAPER

Minister Konda Sureka : యాదగిరిగుట్ట లడ్డూ సూపర్… భక్తులకు, ఆలయాలను మరింత చేరువ చేస్తామన్న మంత్రి సురేఖ

Minister Konda Sureka : యాదగిరిగుట్ట లడ్డూ సూపర్… భక్తులకు, ఆలయాలను మరింత చేరువ చేస్తామన్న మంత్రి సురేఖ

Minister Konda Sureka : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి, వాటి పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి ఆలయాలపై సమీక్ష చేశారు. యాదాద్రి, భద్రాచలం, వేములవాడ దేవాలయాలను అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇందుకోసమే అనేక చర్యలు చేపట్టామన్నారు.


ప్రతి భక్తుడికి ఆలయాలను చేరవ చేస్తాం…

ఇక ప్రతి టెంపుల్​ లోనూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. మరోవైపు దేవాలయాలను భక్తులకు మరింత చేరువ చేయడమే తమ ప్రభుత్వ ఆశయమన్నారు. దేవాదాయ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూట్టామన్నారు. టెంపుల్​ భూములు పరిరక్షిస్తామన్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి లడ్డూ భేష్ అని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం 60 కిలోల మేర బంగారు తాపడం సైతం స్వామివారికి సమర్పించనుందని సురేఖ వివరించారు.

యాదన్న లడ్డూ సూపర్…

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో లడ్డూలను పరీక్షించామని, వాటిల్లో యాదగిరి గుట్ట లడ్డూ అత్యంత శ్రేష్ఠంగా, నాణ్యంగా ఉన్నట్లు రిపోర్ట్ వచ్చిందని చెప్పారు.

మాస్టర్ ప్లాన్ రెఢీ…

ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ దేవస్థానంపై మాస్టర్‌ప్లాన్‌ ను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే దాన్ని రిలీజ్ చేస్తామని వివరించారు. దేవాలయాల్లో 24 రకాల ఆన్‌లైన్‌ సేవలను త్వరలోనే అందిస్తామని మంత్రి అన్నారు. ఈ క్రమంలోనే వాటికి ప్రణాళికలు సైతం సిద్ధమవుతున్నాయన్నారు. ఇక వేములవాడ రాజన్నకు సైతం 65 కిలోల బంగారంతో తాపడం చేయిస్తామన్నారు. వేములవాడను రూ.110 కోట్లతో అభివృద్ధి చేస్తాం’అని మంత్రి సురేఖ తెలిపారు.

అమ్మ ఆలయానికి మహర్దశ…

ఇదే సమయంలో నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేందుకు మాస్టర్‌ ప్లాన్ రెఢీగా ఉందని చెప్పుకొచ్చారు మంత్రి కొండా సురేఖ.

Also Read : ఈనెల 23న ఏపీ క్యాబినెట్ సమావేశం, పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్

Related News

Musi River : మూసీ నిర్వాసితులకు సర్కారు చేయూత

Hyderabad: మియాపూర్‌లో చిరుత సంచారం.. హైదరాబాద్ వాసుల్లో భయం భయం!

Mallanna Sagar : మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరిగిందా? హరీష్ రావు మాటల్లో నిజమెంత!

KTR court issue : ఇదేం పద్ధతి? కేటీఆర్‌పై నాంపల్లి క్రిమినల్ కోర్టు అసహనం

Lady Aghori: కారుపై పుర్రెబొమ్మలు.. డేంజర్ అంటూ సింబల్.. తీరా చూసి అందరూ షాక్.. ఎక్కడ జరిగిందంటే?

Adani group donation: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అదానీ.. తెలంగాణకు భారీ విరాళం.. కారణం ఇదే!

Big Stories

×