EPAPER

Minister komatireddy comments on phone tapping: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు, కేసీఆర్ సూచన, అందుకే..

Minister komatireddy comments on phone tapping: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు, కేసీఆర్ సూచన,  అందుకే..

Minister komatireddy comments on phone tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత వరకు వచ్చింది? ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ఎస్‌బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఎక్కడు న్నట్లు? అనారోగ్యం కారణంగా అమెరికాలో ఆయన ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లు పైకి చెబుతున్నా, లోపల కథ మరోలా ఉందనే టాక్ నడుస్తోంది. మే నెల అయిపోయింది.. జూన్ వచ్చేసింది. ఆయన ఇండియాకు ఎప్పుడు వస్తారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చిన్న క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారణంగా ఈ కేసు మరింత ఆలస్యమవుతుందని చెప్పకనే చెప్పేశారు. నిందితుడు ప్రభాకర్‌రావును మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు కలిశారని వ్యాఖ్యానించారు. మే 26న అమెరికాలోని కొలరాడో, చికాగోలో ప్రభాకర్‌రావును హరీశ్ కలిశారని తెలిపారు. అంతేకాదు ఇప్పట్లో తెలంగాణకు రావొద్దని చెప్పారని మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనుక మాజీ సీఎం కేసీఆర్ సూచనతో హరీశ్‌రావు ఆయన్ని కలిశారన్నది కొత్త పాయింట్. ఈ లెక్కన నిందితుడు ప్రభాకర్‌రావు ఇప్పట్లో రానట్టేనా?

నిందితుడు ఎక్కడ చక్కర్లు కొట్టినా అదుపులోకి తీసుకునేలా ప్లాన్ చేశారు తెలంగాణ సీఐడీ పోలీసులు. వారం కిందట ఆయనకు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. మరో విషయాన్ని కూడా బయటపెట్టారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేదన్నారు. మంత్రి పదవి రాలేదనే తెలంగాణ ఉద్యమం చేపట్టారన్నారు. ఉద్యమ సమయంలో అమాయకులను రెచ్చగొట్టారని విమర్శించా రు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌తో కలిసి భోజనం పేరిట లక్ష రూపాయలు వసూలు చేశారన్నారు.


కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చేపలు, గొర్రెల పంపిణీ పేరిట వేల కోట్లు దోచేశారని ఆరోపించారాయన. ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్‌ఎస్‌లో ఎవరూ ఉండరన్నారు మంత్రి కోమటిరెడ్డి. పదేళ్లగా తెలంగాణను ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ పోయిన ఏడాది దశాబ్ది ఉత్సవాలు చేశారని, శనివారం మళ్లీ దశాబ్ది ఉత్సవాలు మొదలుపెట్టడం ఏంటని ప్రశ్నించారు.

ALSO READ:  ఎగ్జిట్ పోల్స్‌పై కేసీఆర్ ఆగ్రహం, గ్యాంబ్లింగ్‌గా మారాయంటూ..

ప్రపంచంలో వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయిందన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసినా గ్యారెంటీ లేదని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందన్నారు. వందల ఎకరాలున్న వారికీ రైతు బంధు వేశారని గుర్తు చేశారు. 70 వేల మంది టీచర్లు రిటైర్ అయినా డీఎస్సీ నిర్వహించలేదన్నారు. మొత్తానికి రాష్ట్ర అవతరణ రోజున కేసీఆర్ కామెంట్స్‌పై తనదైనశైలిలో కౌంటరిచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×