EPAPER

TS Assembly 2024: కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి.. హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్!

TS Assembly 2024: కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి.. హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్!
Komatireddy Venkat Reddy vs Harish Rao in Telangana Assembly

Komatireddy Venkat Reddy vs Harish Rao in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నువ్వా నేనా అన్నట్లు సాగింది. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింతపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరిగింది.


ముందుగా తెలంగాణ నీటి పారుదుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టుల గురించి, కేఆర్ఎంబీకి వాటి అప్పగింతపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మంత్రి పీపీటీ అయ్యాక స్పీకర్ హరీష్ రావుకు సమయం ఇచ్చారు. హరీష్ రావు మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ పూర్తి అవాస్తవాలతో పీపీటీ ఇచ్చారన్నారు. వాస్తవాలు చెప్పాలని అన్నారు.

నిజాలు చెప్పేందకు తమకు కూడా పీపీటీ అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్ అందుకు సుముఖత చూపించకపోవడం దురదృష్టకరం అని హరీష్ రావు వాపోయారు. మంగళవారం(ఫిబ్రవరి 13) రోజు తాము నల్గొండలో సభ పెడ్తున్నామనే మంత్రి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదనే ప్రకటన చేశారన్నారు. ఇది తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ విజయమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.


Read More: కేసీఆర్ సభకు ఎందుకు రాలేదు..? సీఎం రేవంత్ నిలదీత..

ఆ తర్వాత మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హరీష్‌కు చుక్కలు చూపించారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా ప్రజలను మోసం చేశారన్నారు. అసలు ఏ మొఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నల్గొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్టు తీర్పునిచ్చారన్నారు. కాగా గత ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గానూ 11 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని కేసీఆర్ మోసం చేస్తే నల్గొండ ప్రజలు భూపాల్ రెడ్డిని ఇంటికి పంపించారు.

Read More: ఏపీకి కృష్ణాజలాలను ధారపోసింది కేసీఆరే.. మంత్రి ఉత్తమ్ ఫైర్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడిన స్టేట్‌మెంట్ వినలేదా హరీష్ అని కోమటిరెడ్డి ఫైరయ్యారు. ఆంధ్ర సీఎం చెప్పాక కూడా తమ మీద నింద వేస్తే ఎలా అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాను మోసం చేసిన జగదీష్ రెడ్డికి ముఖం లేకనే ఇవ్వాళ సభకు రాలేదన్నారు.

కృష్ణా జలాల విషయంలో కానీ, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు విషయంలో కానీ కేసీఆర్ నల్గొండ ప్రజలను మోసం చేశారని.. ముక్కు నేలకు రాసి, నల్గొండ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశరు. ఆ తర్వాతే నల్గొండ సభకు రావాలన్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. కేసీఆర్‌ను విమర్శించడం సరికాదన్నారు.

Related News

Ex cm kcr : మరో యాగానికి కేసీఆర్ సిద్ధం.. పార్టీని గట్టెక్కించడానికేనా?

Y.S. Jagan: బుడమేరును నదితో పోల్చిన జగన్..నెటిజన్స్ ట్రోలింగ్

The Goat movie review: గోట్ హిట్ బోట్ ఎక్కిందా? లేదా?.. ఇలాంటి టాక్ ఊహించలేదు

Real life Teachers: ఈ నటులు..రియల్ లైఫ్ లోనూ టీచర్లే… నేడు టీచర్స్ డే

Pawan Kalyan: మా డిప్యుటీ సీఎం కనబడుటలేదు.. పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసలు ఏమైంది?

Kcr in silent mode: వరద సహాయక చర్యలపై గులాబీ నేతల మౌనమేలనో?

Simi Rose Bell John: రాజకీయాలలోనూ క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు

Big Stories

×