EPAPER
Kirrak Couples Episode 1

Minister Komatireddy: అమెరికాలో చదువుకున్నావ్ నీకు కామన్ సెన్స్ ఉందా… కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్

Minister Komatireddy: అమెరికాలో చదువుకున్నావ్ నీకు కామన్ సెన్స్ ఉందా… కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్

Minister Komatireddy: అమెరికాలో చదువుకున్నావు.. అసలు నీకు కామన్ సెన్స్ ఉందా అంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శివాలెత్తారు. అంతటితో ఆగక.. మూసీ మీద చర్చకు నీ అయ్యను రమ్మను కేటీఆర్ అంటూ సవాల్ విసిరారు మంత్రి. దీనితో మూసీ ప్రక్షాళన వేదికగా.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శలు జోరందుకున్నాయి.


హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి దృష్టి సారించింది. మూసీ సుందరీకరణకై ప్రక్షాళన చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్‌ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో 55 కి.మీ పరిధిలో మొత్తం 40 వేల ఆక్రమణలను అధికారులు గుర్తించారు. తాజాగా వాటి కూల్చివేతలను సైతం ప్రారంభించారు అధికారులు. అయితే మూసీ పరివాహక ప్రాంతంలో గల ఆక్రమణదారులు మాత్రం నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం వారికి డబుల్ బెడ్ రూమ్ గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం చేస్తున్న చర్యల పట్ల బీఆర్ఎస్ ముందు నుండి విమర్శలు గుప్పిస్తోంది. అయితే కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగింది. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంచెం ఘాటుగానే బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. అంతేగాక డైరెక్ట్ గా మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా సైతం విమర్శలు ఎక్కుపెట్టారు.

 

మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో తాను మూసీ ప్రక్షాళన కోసం 11 రోజులు దీక్ష చేసినట్లు, మానవత్వం ఉన్న ప్రతి మనిషి మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తారన్నారు. ఇక్కడి ఆక్రమణలు తొలగించేందుకు ప్రజలను ఒప్పిస్తామని, అలాగే ప్రభుత్వం తగిన రీతిలో సాయం చేసేందుకు సిద్దంగా ఉందన్నారు. ప్రతి బాధితుడికి న్యాయం చేస్తామన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి మానవత్వం లేదని, అందులో కేసీఆర్, కేటీఆర్ లకు అస్సలు లేదన్నారు. అమెరికాలో చదవుకున్నావ్.. కేటీఆర్ అసలు నీకు కామన్ సెన్స్ ఉందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

Also Read: Singireddy Niranjan Reddy: చెరువును మింగేసిన నిరంజన్ రెడ్డి.. నీళ్లు కనబడలేదా మహాశయా!

పోరాటాల గడ్డ మా నల్గొండ జిల్లాపై ఎందుకింత కక్ష్య కేటీఆర్ ? అంటూ ప్రశ్నించి.. మా నల్గొండకు వస్తే మూసీ బాధితులను చూపిస్తా అంటూ ఆగ్రహించారు. దమ్ముంటే మూసీ మీద చర్చకు నీ అయ్యను రమ్మను కేటీఆర్ అంటూ మరింత ఘాటుగా విమర్శించారు. ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన సాగిస్తుంటే.. మరో వైపు ఓర్వలేని బీఆర్ఎస్ ప్రజలను పలు విధాలుగా రెచ్చగొడుతుందన్నారు. అయితే ప్రజలు వారి మాటలు నమ్మే పరిస్థితిలో లేదని, ఇప్పటికైనా బుద్ది మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ది కోసం అహర్నిశలు తాము పాటుపడుతుంటే.. అభివృద్దిని అడ్డుకొనేందుకు బీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నిస్తుందన్నారు.

Related News

Mp Raghunandan : అక్కకు జరిగిన అవమానం అది.. వకీలుగా తమ్ముడు కోర్టుకు ఈడుస్తాడు : ఎంపీ రఘునందన్‌

Congress Mla Srinivas reddy : కేటీఆర్ ఇటలీ నీళ్లు తాగొచ్చు కానీ పేదలు మంచినీళ్లు తాగొద్దా : యెన్నం

Demolitions: మూసీ కూల్చివేతలు షురూ!.. కానీ, అక్కడికి బుల్డోజర్లు వెళ్లలేని పరిస్థితి.. మరి వాటిని కూల్చివేయడం ఎలా..?

Minister Sridharbabu: మూసీలో అక్రమ కట్టడాలను గుర్తించాలని కేసీఆర్ ఆదేశించలేదా?: మంత్రి శ్రీధర్ బాబు

GHMC Elections : 2025లో హైదరాబాద్? మేయర్ పీఠం మీద కూర్చునేదెవరు? నగరాన్ని రక్షించేవారికే అందలం

KTR: ఈ పిల్లలకు రాహూల్ ఏమి చెప్తారు ? రాహూల్ కి ట్వీట్ ట్యాగ్ చేసిన కేటీఆర్

Mynampally: పెట్రోల్ బంకులను కూడా హైడ్రా కూల్చివేయాలి: మైనంపల్లి

Big Stories

×