EPAPER

HYDRAA Effect: నన్ను ఏమైనా చేసుకోండి.. నా కాలేజీ జోలికి రావొద్దు : అక్బరుద్దీన్ ఒవైసీ

HYDRAA Effect: నన్ను ఏమైనా చేసుకోండి.. నా కాలేజీ జోలికి రావొద్దు : అక్బరుద్దీన్ ఒవైసీ

HYDRAA Effect: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలోనే పాతబస్తీలో భారీగా చెరువుల ఆక్రమణకు గురయ్యాయని హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల నుంచి సలకం చెరువు మ్యాటర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చెరువును ఆక్రమించి ఫాతిమా కాలేజ్ కట్టారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో చెరువు ఆక్రమణ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.


ఈ వ్యవహారంపై MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. తమపై కక్షగట్టి, నోటీసులు ఇచ్చి, విద్యా సంస్థలను కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ భవనాలను కూల్చినా.. కుతుబ్‌మినార్‌ కంటే ఎత్తయిన భవనాలు నిర్మిస్తామని ఆయన అన్నారు. తాము 40 వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని.. తనపై కక్ష ఉంటే తనను కాల్చాలంటూ ఘాటుగా స్పందించారు. తను చేస్తున్న మంచి కార్యక్రమాలను అడ్డుకోవద్దని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.

ఓ వైపు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతుంటే.. మరోవైపు తనని ఏమైనా చేయండి.. కాలేజీని టచ్ చేయొద్దని ఓవైసీ రియాక్షన్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Also Read: రేవంత్ రెడ్డి పులి మీద నుంచి దిగొద్దు.. దిగితే మింగేసే ప్రమాదముంది: నారాయణ

అలాగే మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దార్ నగర్ కి చెందిన.. 8 ఎకరాల తుమ్మల చెరువు రాత్రికి రాత్రి మాయం చేశారని మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో అనేక చెరువులు కబ్జాకు గురవుతున్నాయని.. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అండదండలతో.. వారి అనుచరులు చెరువులను విచ్చలవిడిగా కబ్జాలు చేశారని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై పలుమార్లు ఎమ్మార్వోలకు, కమిషనర్లకు, కలెక్టర్లకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రంగనాథ్ కు భద్రత పెంపు

అధికారం, ప్రతిపక్షం అని తేడా లేకుండా అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చేస్తోంది. ఎంతటి వారి కట్టడాలైనా చర్యలు తప్పవని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. దీంతో రంగనాథ్ ఇంటికి భద్రత పెంచింది ప్రభుత్వం. అక్రమ నిర్మాణాలు వెనుక బడాబాబులు ఉండటంతో.. రంగనాథ్‌కు ప్రాణహాని ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆయన ఇంటి వద్ద భద్రత మరింత పటిష్టం చేసింది. కమిషనర్ రంగనాథ్ ఇంటి సమీపంలో చెక్ పోస్ట్‌ ఏర్పాటు చేసింది.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×