EPAPER
Kirrak Couples Episode 1

Medigadda barrage : మేడిగడ్డ నష్టమెంత..? ప్రాజెక్ట్ ఉంటుందా.. మూలనపడుతుందా..?

medigadda barrage : మేడిగడ్డ బ్యారేజ్ కు అనుకున్న దానికంటే ఎక్కువ నష్టమే జరిగినట్లు ఇరిగేషన్ ఇంజినీర్లు అనుమానిస్తున్నారు. ఏడో బ్లాక్ తో పాటు దాన్ని అనుకుని ఉన్న 6, 8వ బ్లాక్ పైనా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. పునాది వద్ద ఇన్వెస్టిగేషన్ పూర్తిస్థాయిలో చేస్తే అసలు మ్యాటర్ ఏంటన్నది తేలనుంది. మరోవైపు పంప్ హౌజ్ లు ప్రాజెక్ట్ వాటర్ లెవల్ ను పట్టించుకోకుండా కట్టడంతో నష్టం జరిగిందని, మరోసారి మునిగే ప్రమాదం ఉంటుందని ఇరిగేషన్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

Medigadda barrage : మేడిగడ్డ నష్టమెంత..?  ప్రాజెక్ట్ ఉంటుందా.. మూలనపడుతుందా..?

Medigadda barrage : మేడిగడ్డ బ్యారేజ్ కు అనుకున్న దానికంటే ఎక్కువ నష్టమే జరిగినట్లు ఇరిగేషన్ ఇంజినీర్లు అనుమానిస్తున్నారు. ఏడో బ్లాక్ తో పాటు దాన్ని అనుకుని ఉన్న 6, 8వ బ్లాక్ పైనా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. పునాది వద్ద ఇన్వెస్టిగేషన్ పూర్తిస్థాయిలో చేస్తే అసలు మ్యాటర్ ఏంటన్నది తేలనుంది. మరోవైపు పంప్ హౌజ్ లు ప్రాజెక్ట్ వాటర్ లెవల్ ను పట్టించుకోకుండా కట్టడంతో నష్టం జరిగిందని, మరోసారి మునిగే ప్రమాదం ఉంటుందని ఇరిగేషన్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.


మేడిగడ్డ దగ్గర అసలు మ్యాటర్ తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. మీడియా ప్రతినిధుల సమక్షంలో మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహించనున్నారు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. ప్రాణహిత–చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం నిర్మాణంతో జరిగిన లాభ, నష్టాలు, ప్రాజెక్టు ఖర్చు, ప్రతిపాదిత ఆయకట్టు, నీళ్లిచ్చిన ఆయకట్టు, ప్రాజెక్టు నిర్వహణ వ్యయం, కరెంట్ అవసరాలు, ఖర్చులు…, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో చోటుచేసుకున్న సాంకేతిక లోపాలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

ప్రజెంటేషన్‌ తర్వాత మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను మంత్రులిద్దరూ సందర్శించి లోపాలు, సమస్యలను పరిశీలిస్తారు. గత అక్టోబర్‌ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, ఆ తర్వాత కొన్ని రోజులకే అన్నారం బ్యారేజీకి బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీకయ్యాయి. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్‌ పునర్నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ మధ్య పేచీ నడుస్తోంది. సొంతంగా పునర్నిర్మాణం జరుపుతామని గత ప్రభుత్వ హయాంలో హామీ ఇచ్చిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాటను మార్చింది. ప్రాజెక్టు డిఫెక్ట్‌ లయబిలిటీ గడువు ముగిసిందని, అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే 7వ బ్లాక్‌ పునర్నిర్మాణం చేపడతామని స్పష్టం చేసింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో రిపేర్ పని అయితే మొదలైంది. నిర్మాణ సంస్థలతో పాటు సబ్‌ కాంట్రాక్టర్లు, ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న వారందరూ మేడిగడ్డ రావాల్సిందే అని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.


మేడిగడ్డ బ్యారేజీకి భారీ నష్టమే వాటిల్లినట్టు ఇరిగేషన్ ​ఇంజినీర్లు అనుమానిస్తున్నారు. బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్ ​కు మాత్రమే నష్టం పరిమితం కాదని, దానికి ఆనుకుని ఉన్న 6, 8 బ్లాకులపైనా ఆ ప్రభావం పడినట్టుగా ప్రాథమికంగా చెబుతున్నారు. బ్యారేజీ పునాది వద్ద భారీగా పేరుకుపోయిన ఇసుకను తొలగించి ఇన్వెస్టిగేషన్​ చేస్తే ఓవరాల్ నష్టం ఎంత అన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఆరు, ఏడు, ఎనిమిది బ్లాకులు ​పూర్తిగా మహారాష్ట్ర భూభాగంలో ఉన్నాయి. కుంగిన ఏడో బ్లాక్ ​సహా మహారాష్ట్ర వైపు పేరుకు పోయిన ఇసుకను తొలగించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇందుకోసం ఇరిగేషన్​ అధికారులు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు. ఆ రాష్ట్రం నుంచి క్లియరెన్స్​ వస్తే తప్ప బ్యారేజీ కుంగుబాటుకు దారితీసిన పరిస్థితులు ఏమిటో తేలే అవకాశం లేదు. ఆరో బ్లాక్ ​నుంచి ఎనిమిదో బ్లాక్ ​వరకు నీళ్లు ఆగకుండా మట్టికట్ట కట్టి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర పర్మిషన్ ​కోసం ఎదురుచూస్తున్నారు.

గోదావరి నదిపై 1.62 కిలోమీటర్ల పొడవైన మేడిగడ్డ బ్యారేజీని ఎనిమిది బ్లాకులుగా నిర్మించారు. దానికి 85 వరద గేట్లు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర వైపునకు ఉన్న మూడు బ్లాకుల్లో 36 గేట్లున్నాయి. ఏడో బ్లాక్​లోని 20వ పిల్లర్​ భారీ శబ్దంతో కుంగిపోయింది. 1.20 మీటర్ల లోతుకు 20వ పిల్లర్​ కుంగినట్టుగా గుర్తించారు. ఇన్వెస్టిగేషన్ లో తమను కూడా పిలవాలని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కు NDSA లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం ఇసుకపై కాంక్రీట్ రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించారు. రాఫ్ట్ కు కింద నది లోపల తవ్వి పిల్లర్ల కోసం ఫౌండేషన్ వేశారు. వరద ఉధృతికి పిల్లర్లు కదలకుండా రాఫ్ట్ ఫౌండేషన్ తో బలంగా ఉండేలా చేశారు. ఏడో బ్లాక్ లోని 20వ పిల్లర్ కుంగిన తర్వాత దానికి ఇరు వైపులా ఉన్న ఆరు, ఎనిమిది బ్లాకుల్లో గల పిల్లర్లకూ డ్యామేజ్ అయినట్టు ఫీల్డ్ ఇంజినీర్లు గుర్తించినట్టు తెలిసింది.

ఇసుకను తీస్తే రాఫ్ట్ ఫౌండేషన్ లో ఏమైనా లోపాలు ఉన్నా బయటపడుతాయంటున్నారు. మొదట్లో డ్యామేజీలు ఏడో బ్లాక్ కే పరిమితమయ్యాయని అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే నష్టం భారీగానే ఉంటుందని ఇంజినీర్లు అనుమానిస్తున్నారు. ఇప్పుడైనా హడావుడి రిపేర్లతో మమ అనిపించకుండా.. బ్యారేజీలో లోపాలపై సమగ్రమైన సర్వే చేయాలని, ఆ తర్వాతే రిపేర్లపై దృష్టి పెట్టాలని సాగునీటి పారుదల శాఖలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఎఫ్‌ఆర్‌ఎల్‌ దిగువన కట్టిన మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్ లు మళ్లీ మునిగే అవకాశాలున్నాయని, కంట్రోల్‌ యూనిట్లు, స్టార్టర్లు సురక్షిత ప్రదేశంలోకి తరలిస్తేనే ముంపు నుంచి కాపాడవచ్చని నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి అంటున్నారు. మేడిగడ్డ పంప్‌హౌస్ ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతినిస్తే.. దాన్ని 120 మీటర్ల వద్ద కట్టారని, దీనికి జెన్‌కో ఆమోదం తీసుకున్నారని, అదే అన్నారం వద్ద పంప్‌హౌ‌స్ ను 131 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతి ఇస్తే.. 125 మీటర్ల ఎత్తులో కట్టారని, ఈ కారణంగానే పంప్‌హౌస్‌ మునిగిందన్నారు.

ఈ వ్యవహాలు ఇలా ఉంటే… మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ పనులకు సంబంధించిన నైపుణ్యం తమ దగ్గర లేదని, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థలను ఎంపిక చేసి సేఫ్టీ డిజైన్లు తీసుకోవాలని తెలంగాణ సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ క్లారిటీ ఇచ్చింది. కేంద్ర జల సంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేసి ఇన్వెస్టిగేషన్‌, డిజైన్‌, పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతో పాటు రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు డిజైన్లు ఇచ్చిన సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌, తాజాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగి పియర్స్‌ దెబ్బతినడం, అన్నారంలో సీపేజీ ఏర్పడిన నేపథ్యంలో ఈ రెండింటి పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్‌ సహా అన్నింటినీ వేరే సంస్థకు అప్పగించాలని సూచించడం కీలకంగా మారింది.

నిర్మాణ సమయంలో ఇచ్చిన మోడల్‌ స్టడీస్‌కు, తర్వాత బ్యారేజీ నిర్వహణ తీరుకు పొంతన లేకపోవడం వల్లే సమస్యలు వచ్చాయంటున్నారు. మేడిగడ్డలో గేట్లను పూర్తిగా మూసి నీటిమట్టం పూర్తి స్థాయికి వచ్చిన తర్వాత గేట్లు ఎత్తి నీటిని వదిలారని, దీనివల్ల నీటి వేగంలో మార్పు వచ్చి, దిగువ భాగంలో ఆప్రాన్‌ దాటి నీళ్లు పడటం వల్ల సమస్య వచ్చిందని అంటున్నారు. డిజైన్ ఒకలా, నిర్వహణ మరోలా ఉండడం ఒక కారణంగా చెబుతున్నారు. అసలు మొత్తంగా ఏది సమస్య అన్నది త్వరలోనే తేలనుంది.

Related News

Samantha: హేమా కమిటీ టాలీవుడ్ లో వేయాలన్న సమంత.. మరి జానీ మాస్టర్ కేసు పై నోరు మెదపదా..?

Manchu Vishnu: కల్తీ లడ్డూ.. ప్రకాష్ రాజ్ కి కౌంటర్.. పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన విష్ణు..!

Tollywood heroine: తెలుగు హీరోయిన్ భర్తకి యాక్సిడెంట్.. ఐసీయూలో చేరిక.!

Saripodhaa Sanivaram: 28 రోజులకే ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..?

Mrunal thakur: అతడిని పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్..!

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Bigg Boss: హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న అభయ్.. 3 వారాలకు పారితోషకం ఎంతంటే..?

Big Stories

×