EPAPER

Marriage: అధిక కట్నం కావాలన్న వధువు.. పెళ్లి క్యాన్సిల్.. షాక్‌లో వరుడు

Marriage: అధిక కట్నం కావాలన్న వధువు.. పెళ్లి క్యాన్సిల్.. షాక్‌లో వరుడు

Marriage: అధిక కట్నం కోసం పెళ్లి కొడుకు తరుపువారు డిమాండ్ చేయడం చూస్తూ ఉంటాం. కొందరైతే ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. కానీ అమ్మాయి తరుపున వాళ్లు కట్నం సరిపోలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఘటన ఎప్పుడైనా చూశారా?. ఇటువంటి ఘటనే హైదారాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో చోటుచేసుకుంది.


ఘట్‌కేసర్‌కు చెందిన ఓ యువకుడికి కొంతకాలంగా పెళ్లి కావడం లేదు. వయస్సు పెరుగుతున్నప్పటికీ పెళ్లి కాకపోవడంతో ఆ యువకుడు ఆందోళనకు గురయ్యాడు. ఎదురుకట్నం ఇచ్చిమరీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. అమ్మాయి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు ఎదురుకట్నం ఇచ్చే విధంగా మాట్లాడుకున్నారు.

ఇక ఇరువురి ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి 7.21 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇరువురి బంధువులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు మూడు ముళ్లు వేయనున్నాడు. ఈక్రమంలో వరుడికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. తాను ఈ పెళ్లిని చేసుకోలేనని వధువు తేల్చి చెప్పింది.


అబ్బాయి తరుపున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని.. అదనంగా కట్నం కావాలని డిమాండ్ చేసింది. లేదంటే తాను ఈ పెళ్లి చేసుకోనని పెళ్లికి కొద్దినిమిషాల ముందు మొండికేసింది. దీంతో వరుడు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సర్దిచెప్పినా కూడా అమ్మాయి తరుపు వారు వినలేదు. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయి ఏటోళ్లు అటు వెళ్లిపోయారు.

Tags

Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

×