EPAPER

Man on Charminar: చార్మినార్‌ పైకి ఎక్కిన వ్యక్తి… స్టంట్స్ చేస్తున్నాడా..?

Man on Charminar: చార్మినార్‌ పైకి ఎక్కిన వ్యక్తి… స్టంట్స్ చేస్తున్నాడా..?

Man wass seen walking on Charminar: సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లు రోజురోజుకు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. క్షణాల్లో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వారు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు.. ఎలాంటి రూల్స్ ఉన్నా మాకు సంబంధంలేదు.. మా ఇష్టంవచ్చినట్లు చేస్తాం అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. ఏదైనా పరిధికి లోబడి ఉంటే బాగుంటుంది.. కానీ, అది పరిధి దాటితే వారికే కాదు.. వారి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గత కొద్ది రోజుల నుంచి అటువంటి వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. నిన్న మొన్న ఓ యూట్యూబర్ కూడా ఇలా పరిధికి మించి వ్యవహరించాడు. నగరంలో రోడ్లపై డబ్బులు విసిరి వీడియోలు తీస్తూ హల్చల్ చేశాడు. ఆ వీడియో నెట్టింటా వైరల్ అయ్యింది. చివరకు ఆ వీడియో పోలీసుల వరకు చేరింది. దీంతో వారు స్పందించారు. అతడిపై పలు చర్యలు సైతం తీసుకున్నారు. ఇక నుంచి ఈ విధంగా ఎవరు పాల్పడినా వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. అతను ఏకంగా చార్మినార్ పైకి ఎక్కి అటు ఇటు వెళ్తూ కనిపించాడు. చార్మినార్ ఎక్కడమే కాకుండా చివరి అంతస్తులో అటు ఇటు కిటికీలు పట్టుకుంటూ ముందుకువెళ్లసాగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రాత్మకమైన కట్టడంపై ఇలాంటి సాహసాలు ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు మరోసారి రిపీట్ కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు.


Also Read: రూ.1500 కోట్లు ఉన్నాయి కదా.. పేదలకు రూ.500 కోట్లు ఇవ్వండి.. బీఆర్ఎస్‌కు సీఎం సెటైర్

ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వస్తున్న వివరాల ప్రకరాం.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి  పాతబస్తీలో ఉన్న చార్మినార్ ఎక్కాడు. చార్మినార్ చివరి అంతస్తువరకు ఎక్కి.. అక్కడ కిటికీలు పట్టుకుంటూ అటు ఇటు వెళ్తూ కనిపించాడు. ఇదంతా కూడా ఎవరో వీడియో తీసి నెట్టింటా పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎవరు ఆ వ్యక్తి.? ఎందుకు చార్మినార్ పైకి ఎక్కాడు..? అంతవరకు ఎలా వెళ్లాడు..? ఈ విషయమై అధికారులు దర్యాప్తు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే, సంబంధిత అధికారులు స్పందిస్తూ చార్మినార్ వద్ద ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అందులో భాగంగానే కార్మికుల్లో ఎవరో ఒకరు అక్కడికి వెళ్లి ఉండొచ్చని చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతామంటూ కూడా వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది.


Also Read: గబ్బు మాటలు మాట్లాడుతున్నారని కోర్టులో పరువు నష్టం దావా వేశా: కేటీఆర్

Related News

Hydra: కబ్జాగాళ్ల గుండె జారే న్యూస్.. హైడ్రా‌కు చట్టబద్దత, గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కానీ..

Bathukamma Celebrations: గాంధీ భవన్‌లో బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న జగ్గారెడ్డి

Jaggareddy: నువ్వు ఢిల్లీ వెళ్లు… నేను మీ మామ ఫాం హౌస్‌ కు వెళ్తా.. హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్

Cm Revanth: రూ.1500 కోట్లు ఉన్నాయి కదా.. పేదలకు రూ.500 కోట్లు ఇవ్వండి.. బీఆర్ఎస్‌కు సీఎం సెటైర్

KTR Reaction: గబ్బు మాటలు మాట్లాడుతున్నారని కోర్టులో పరువు నష్టం దావా వేశా: కేటీఆర్

Nukala Naresh Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత నరేష్‌రెడ్డి ఇక లేరు

Big Stories

×