EPAPER

Sunil Kanugolu : తెలంగాణలో కాంగ్రెస్ విజయం తెరవెనుక ఉన్నది ఇతనే!

Telangana Congress Victory | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కాంగ్రెస్ మొదటిసారి అసెంబ్లీ ఎనిక్నల్లో విజయం సాధించింది. ఈ గెలుపు అంత సునాయాసంగా రాలేదు. ఇందుకు ఎన్నో కారణాలున్నాయి. అందరిముందు రేవంత్ రెడ్డి ప్రతక్షంగా కష్టపడితే.. తెరవెనుక ఉన్న మాస్టర్ మైండ్ మరొకరు. ఆ వ్యూహకర్త పేరు సునీల్ కనుగోలు(Sunil Kanugolu).

Sunil Kanugolu : తెలంగాణలో కాంగ్రెస్ విజయం తెరవెనుక ఉన్నది ఇతనే!

Sunil Kanugolu : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కాంగ్రెస్ మొదటిసారి అసెంబ్లీ ఎనిక్నల్లో విజయం సాధించింది. ఈ గెలుపు అంత సునాయాసంగా రాలేదు. ఇందుకు ఎన్నో కారణాలున్నాయి. అందరిముందు రేవంత్ రెడ్డి ప్రతక్షంగా కష్టపడితే.. తెరవెనుక ఉన్న మాస్టర్ మైండ్ మరొకరు. ఆ వ్యూహకర్త పేరు సునీల్ కనుగోలు(Sunil Kanugolu).


కాంగ్రెస్ విజయానికి రాత్రనక, పగలనక రేవంత్ రెడ్డి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. తెరముందు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సారధ్యం వహించి సీనియర్ నాయకులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. అయితే 2014లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను పక్కకు తోసి అధికారాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్ లాంటి ఉద్దండులని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డికి సునీల్ కనుగోలు తోడుగా నిలిచారు.

సునీల్ కనుగోలు ఎవరు?


కర్ణాటకకు చెందిన సునీల్ కనుగోలు ఒక ఎన్నికల వ్యూహకర్త. ఆయన ఇంతకుముందు అమెరికాలోని మెకిన్సే కంపెనీలో పనిచేశారు. మెకిన్సే కంపెనీ ఒక గ్లోబల్ కన్సల్టెన్సీ. బడా కంపెనీలకు, ప్రభుత్వాలకు, విధానపరమైన నిర్ణయాల గురించి సలహాలు ఇస్తూ ఉంటుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజేపీ విజయం సాధించడంతో.. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో బిజేపీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త పనిచేశారు. ఆ సమయంలోనే సునీల్ కనుగోలు.. ప్రశాంత్ కిషోర్‌తో పనిచేశారు.

ఆ తరువాత 2016లో ఆయన తమిళనాడు ఎన్నికలకు డియంకే తరపున పనిచేశారు. కానీ డియంకే స్వల్ప సీట్లతో ఓడిపోయింది. అయినా ఆ ఎన్నికల్లో డియంకే అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇమేజ్ ఎంతో పెరిగిపోయింది. దీనికి సునీల్ రచించిన ఎన్నికల వ్యూహాలే కారణం. ఆ తరువాత 2016లోనే బిజేపీ కోసం సునీల్.. అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అనే విభాగంలో పనిచేశారు. ఈ విభాగం ఉద్దేశం బిజేపిని ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిపెట్టడం. అయితే కర్ణాటక మినహా ఆయన అన్ని రాష్ట్రాల ఎన్నికల కోసం పనిచేశారు. ఆయా రాష్ట్రాలలో బిజేపీ విజయం సాధించింది.

ఆ తరువాత ఆయన మళ్లీ 2018 నుంచి రాబోయే(2019) లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు డియంకే తరపున పనిచేశారు. ఆ సమయంలో డియంకే కోసం సునీల్ కనుగోలు.. బిజేపీకి వ్యతిరేకంగా పనిచేశారు. తమిళనాడులో ప్రధాని మోదీకి వ్యతిరేక భావజాలం తీసుకొచ్చారు. ఈసారి కూడా ఆయన వ్యూహాలు డియంకే విజయం సాధించి పెట్టాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో డియంకే కూటమికి రాష్ట్రంలోని 40 సీట్లలో 39 సీట్లు వచ్చాయి. కానీ ఆ తరువాత డియంకే పార్టీతో విభేదాలు రావడంతో ఆయన తమిళనాడు అధికార పార్టీ ఎఐఎడియంకే కోసం 2019 నవంబర్ నుంచి పనిచేయడం మొదలు పెట్టారు. మరోవైపు డియంకే ఆయన స్థానంలో ప్రశాంత్ కిషోర్‌ని ఎన్నికల వ్యూహకర్తగా నియమించింది.

అలా ఆయన 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన సీనియర్ ప్రశాంత్ కిషోర్‌తో పోటీ పడ్డారు. కానీ ఈసారి ఆయన వ్యూహాలు పనిచేయలేదు. కారణం ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డియంకే బలంగా ఉండడం. ఎఐఎడియంకే పార్టీలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత లాంటి బలమైన నాయకులు లేకపోవడం.

సునీల్ కనుగోలుకు 2021లో తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ తరపున పిలుపువచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన చాలా రోజులపాటు చర్చలు జరిపారు. కానీ ఎందుకనో కేసీఆర్ కోసం సునీల్ కనుగోలు పనిచేయలేకపోయారు. కొన్ని రోజుల తరువాత సునీల్ కనుగోలుకు మరో పెద్ద ఆఫర్ వచ్చింది. కాంగ్రెస్ ఎన్నికల ప్లానింగ్ కమిటీకి ఆయన చైర్మెన్‌గా నియమితులయ్యారు. అలా కర్ణాటక, తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పనిచేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఆయన సలహాదారుడిగా కూడా పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయం వెనుక సునీల్ కీలక పాత్ర పోషించారు.

2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్య పరిచాయి. కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధించింది. ఆ తరువాత ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రత్యర్థి బిఆర్ఎస్‌ని మట్టికరిపించింది. మరోవైపు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సునీల్‌తో పనిచేయడానికి ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులైన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, కమల్ నాథ్ సునీల్‌తో కలిసి పనిచేయడానికి నిరాకరించారు. ఫలితంగా ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటమి పాలైందని విశ్లేషకులు చెబుతున్నారు.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×