EPAPER

Mallanna Sagar : మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరిగిందా? హరీష్ రావు మాటల్లో నిజమెంత!

Mallanna Sagar : మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరిగిందా? హరీష్ రావు మాటల్లో నిజమెంత!

Mallanna Sagar : తెలంగాణ అంతటా మూసీ ముచ్చటే నడుస్తోంది. భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. తమ డెవెలప్‌మెంట్ విజన్ ఎలా ఉండబోతోందో సీఎం రేవంత్ రెడ్డి వీడియో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నిర్వాసితులను తప్పుదోవ పట్టించొద్దని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నిర్వాసితులు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావన్నారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా ముందుకొచ్చారు. సీఎం వ్యాఖ్యలపై మండిపడుతూ, మల్లన్న సాగర్ నిర్వాసితులకు అన్ని రకాలుగా న్యాయం చేశామన్నారు. హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలపై అటు నిర్వాసితులు, ఇటు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.


మల్లన్న సాగర్ ఎలా మొదలైంది?

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట – కొండపాక మండలాల శివారులో ఉన్న గుట్టల మధ్య మల్లన్న సాగర్ జలాశయాన్ని కట్టారు. 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. కాళేశ్వరం రిజర్వాయర్లు అన్నింటిలో అతి పెద్దది, అత్యంత ఎత్తున ఉన్నది ఈ జలాశయం మాత్రమే. 2016లో భూసేకరణ మొదలవ్వగా, 2022లో పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. అయితే, 14 గ్రామాల ప్రజలు ఈ ప్రపోజల్‌‌ను వ్యతిరేకించారు. దాదాపు 2 నెలలపాటు పోరాటం చేశారు. చివరకు కొందర్ని భయపెట్టడం, కొందరికి ఆశ చూపించడం, ఇలా బీఆర్ఎస్ కుయుక్తులతో అప్పటి మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి(ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే), ఆనాటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చర్చలు జరిపి ఎకరానికి రూ.5,85,00 నుంచి రూ.6 లక్షలు ఇచ్చేలా ఒప్పించారు.


నిర్వాసితులకు హామీల వర్షం.. అమలయ్యింది కొన్నే!

హరీష్‌ రావు తాజాగా చెప్పినదాని ప్రకారం, అన్నీ చేసేశాం, చేయడానికి ఇంకేం లేదట్టుగా ఉంది. స్థలం కేటాయించాం, ఇల్లు కట్టాం, నల్లా కనెక్షన్‌ ఇచ్చాం, ఓ కొత్త తాళం కొని దాన్ని బాధితులకు అందించాం. ఇంకేం చేయాలి అన్నట్టు మాట్లాడారు. మరి, బాధితులకు పూర్తిగా న్యాయం జరిగిందా అంటే మాత్రం లేదనేది మల్లన్న సాగర్ నిర్వాసితుల మాట. గుడికి గుడి, బడికి బడి, ఇంటికి ఇల్లు, స్మశానానికి స్మశానం కట్టిస్తామని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మాటలు నమ్మి, దాదాపు 20వేల ఎకరాలు వదిలేసిన 14 గ్రామాలకు చెందిన 10వేల జనాభా చెట్టుకొకరు, గుట్టకొకరుగా, చెట్టిడిసిన పక్షుల్లా మారారు. హరీష్ రావు ఏర్పాటు చేశామని చెబుతున్న కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. సరైన రోడ్లు, డ్రైనేజీలు లేవు. ఆనాడు హడావుడిగా చేసిన పనులు శిథిలావస్థకు చేరాయి.

ALSO READ : ఇదేం పద్ధతి? కేటీఆర్‌పై నాంపల్లి క్రిమినల్ కోర్టు అసహనం

ఇంటి నిర్మాణాల్లో అత్యంత నాణ్యతా లోపాలున్నాయి. ఒంటరి మహిళలు, పురుషులకు ఇప్పటిదాకా న్యాయం జరిగింది లేదు. చాలామంది దీనావస్థలో చనిపోయారు కూడా. అంతేకాదు, సరైన మౌలిక వసతులు లేక నిత్యం నరకం చూస్తున్నారు నిర్వాసితులు. కొందరికి ఇళ్లు దక్కలేదని, స్థలాలు ఇవ్వలేదని, పూర్తిస్థాయిలో ప్యాకేజీలు దక్కలేదని ఇప్పటికీ ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు దగ్గరలోనే లేవు. శివారు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించడంతో నిర్వాసితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరి, అది చేశాం, ఇది చేశాం అని చెబుతున్న హరీష్ రావు, వీటన్నింటికి సమాధానం చెప్తారా? అని అటు నిర్వాసితులు, ఇటు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Related News

Lady Aghori Naga Sadhu: మహిళా అఘోరితో ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. సంచలన విషయాలు!

Musi river : మూసీకి జలకళ సాధ్యమే..

Congress : ఆన్‌లైన్ డ్రామారావు కేటీఆర్ – చామల కిరణ్ కుమార్ రెడ్డి

Musi River : మూసీ నిర్వాసితులకు సర్కారు చేయూత

Hyderabad: మియాపూర్‌లో చిరుత సంచారం.. హైదరాబాద్ వాసుల్లో భయం భయం!

KTR court issue : ఇదేం పద్ధతి? కేటీఆర్‌పై నాంపల్లి క్రిమినల్ కోర్టు అసహనం

Big Stories

×