EPAPER

CM Revanth Reddy America Tour: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..

CM Revanth Reddy America Tour: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..

అమెరికాలో సక్సెస్ ఫుల్ గా సాగిన రేవంత్ పర్యటన కొరియాలో కూడా విజయవంతంగానే నడుస్తోంది. పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ టీం విదేశీ పర్యటనకు వెళ్లారు. అమెరికాలో ఎనిమిది రోజుల పాటు పర్యటించారు. 8 రోజుల్లో 50కి పైగా వాణిజ్య సంస్థలతో చర్చలు జరిపారు. 19 కంపెనీలు 31వేల 532 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్ పై మొదటి నుంచి సీఎం ఫోకస్ చేస్తున్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులకు కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఇక విద్యుత్‌ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్‌ రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడానికి పలు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ కంపెనీల కారణంగా రాష్ట్రంలో 30 వేల 750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.


స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు, కృత్రిమ మేధ నగరం, ఫ్యూచర్‌ సిటీ నిర్మించే దిశగా తమ ప్రభుత్వం వేసిన అడుగులకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించింది. అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణను సరికొత్తగా చూపించామని రేవంత్ బృందం ప్రకటించింది.

Also Read: ఢిల్లీ లిక్కర్ కేసు.. కవితకు మళ్లీ నిరాశే, ఆగస్టు 20న మరోసారి..

ఇక ఈ పర్యటనలో అంతర్జాతీయ కంపెనీలైన కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్‌, ఆమ్జెన్, జొయిటిస్ లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు వారి వ్యాపారాలను విస్తరించేందుకు ఆసక్తి చూపించాయి.

అమెజాన్ కూడా హైదరాబాద్ లో డేటా సెంటర్ విస్తరణకు ఓకే చెప్పింది. సీఎం విదేశీ పర్యటన డబుల్ సక్సెస్ అయిందని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్. ఇక.. యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీతో పాటు.. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ సీఎం బృందం చర్చలు జరిపింది. అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని ప్రస్తుతం ముఖ్యమంత్రి దక్షిణ కొరియా పర్యటన చేపట్టారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×