EPAPER
Kirrak Couples Episode 1

LPG cylinder rates: మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

LPG cylinder rates: మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

Commercial LPG cylinder rates hiked: గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రతినెలా మొదటి తేదీన ఎల్పీజడీ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి రేట్లను పెంచేశాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా రూ.50 వరకు పెంచారు. దీంతో దసరా, దీపావళి పండుగలకు ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ధరలు నేటినుంచి అమల్లోకి రానున్నాయి. పండగ వేళ సామాన్యుడిపై భారం పడనుంది.


అయితే, 14.2కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,967 ఉండగా.. డొమెస్టిక్ ధర రూ.855 గా ఉంది.

ఢిల్లీలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,740కి చేరింది. అంతకుముందు రూ.1691.50గా ఉండేది. అలాగే కోల్ కతాలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1850.50కి చేరగా.. సెప్టెంబర్ లో రూ.1802.50గా ఉండేది. ఇక, ముంబైలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూరూ.1692 కు చేరగా.. గత నెలలో రూ.1644గా, చెన్నైలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ రూ.1903 ఉండగా.. గతంలో రూ.1855గా ఉండేవి.


Also Read: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది దుర్మరణం

అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు పెంచడంతో రెస్టారెంట్లు, హోటళ్లు, దాబా, ఇతర ఫుడ్ కోర్టులలో ఆహారానికి సంబంధించిన ధరలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదు. ఎల్పీజీ ధరలు పెరగడంతో ఇతర ధరలు కూడా పెంచే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉండగా, గత మూడు నెలలుగా ఎల్పీజీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు ఆగస్టు, సెప్టెంబర్‌లో కూడా ధరలు పెంచారు. ఆగస్టులో రూ.8 నుంచి 9 వరకు పెంచగా.. సెప్టెంబర్ నెలలో రూ.39 పెంచారు. తాజాగా, అక్టోబర్‌లో రూ.48.50 వరకు పెంచేశారు.

 

Related News

Musi redevelopment project: మూసీ ప్రక్షాళన అడ్డుకోవడం వెనుక.. చేతులు మారిన వందల కోట్లు

Nerella Sharada: మహిళా కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు, ఆపై ఆగ్రహం..

Telangana DSC 2024: సర్వం సిద్ధం.. నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

MLC Kavitha: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత

CM Revanth Reddy: హస్తినలో సీఎం రేవంత్‌రెడ్డి.. ఈసారి

Road Accidents: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది దుర్మరణం

Big Stories

×