EPAPER

Drugs Case : రాజ్ పాకాలను 9 గంటల సుదీర్ఘ విచారణ.. పోలీసుల ప్రశ్నల వర్షం

Drugs Case : రాజ్ పాకాలను 9 గంటల సుదీర్ఘ విచారణ.. పోలీసుల ప్రశ్నల వర్షం

Drugs Case :


⦿ జన్వాడ ఫాంహౌస్‌కు పాకాల రాజ్
⦿ ఆరోజు పార్టీ జరిగిన తీరుపై ఆరా
⦿ సీన్ రీ క్రియేట్ చేసిన పోలీసులు
⦿ మోకిల్ పీఎస్‌లో 9 గంటల పాటు సుదీర్ఘ విచారణ
⦿ ఆల్కాహాల్, డ్రగ్స్ వాడకంపై ప్రశ్నలు
⦿ పాకాల రాజ్ స్టేట్మెంట్ రికార్డ్

హైదరాబాద్, స్వేచ్ఛ: సంచలనం రేపిన జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో కేటీఆర్ బావమరిది పాకాల రాజ్ విచరాణకు హాజరయ్యారు. మోకిల పోలీస్ స్టేషన్‌కు 12 లాయర్లతో కలిసి వచ్చారు. అయితే, విచారణలో ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. సుమారు 3 గంటలపాటు విచారించారు పోలీసులు. అనంతరం సీన్ రీక్రియేషన్ కోసం జన్వాడ ఫాంహౌస్‌కు తీసుకెళ్లారు.


విచారణలో ప్రశ్నల వర్షం

నార్సింగి ఏసీపీ ఆధ్వర్యంలో పాకాల రాజ్ విచారణ జరిగింది. 9 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో జరిగిన పార్టీ, విజయ్ మద్దూరి స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు. తనకు కొకైన్ ఇచ్చింది రాజ్ అని చెప్పిన నేపథ్యంలో అది ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో విచారించారు. విచారణలో భాగంగా రాజ్ పాకాల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. మరో నిందితుడు విజయ్ మద్దూరిని మరోసారి విచారించనున్నారు. ఇప్పటికే ఓసారి విచారణకు ఆయన డుమ్మా కొట్టారు.

విచారణ తర్వాత ఫాంహౌస్‌లో తనిఖీలు

మోకిల పీఎస్‌లో పాకాల రాజ్ విచారణ తర్వాత తన ఫాంహౌస్‌‌కి తీసుకెళ్లారు పోలీసులు. ఆ సమయంలో మీడియా ఆయన్ను ప్రశ్నించగా, సమాధానాలు దాటవేశారు. ఫాంహౌస్ లోపల ఆరోజు రాత్రి జరిగిన ఘటనను సీన్ రీ క్రియేట్ చేశారు పోలీసులు. మరోసారి తనిఖీలు చేశారు. దాదాపు గంట పాటు ఫాంహౌస్‌లో సోదాలు కొనసాగాయి. సెల్ ఫోన్ కోసం తనిఖీలు చేసిన పోలీసులు, అది లభించకపోవడంతో తర్వాత పాకాల రాజ్‌ను స్టేషన్‌కి తీసుకొచ్చి విచారించారు.

ఫాంహౌస్ దగ్గర ఉద్రిక్తత

పాకాల రాజ్ ఫాంహౌస్‌లో తనిఖీల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ సన్నిహితులు అక్కడకు వచ్చారు. కేటీఆర్ ఫ్రెండ్ జాన్సన్ నాయక్ రాగా, పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి కావాలని ఆయన కోరగా, అందుకు కుదరదని స్పష్టం చేశారు. గేటు దగ్గరే జాన్సన్‌ను నిలిపివేశారు.

అది ఫ్యామిలీ పార్టీనే..

విచారణ అనంతరం మీడియాతో  మాట్లాడిని రాజ్ పాకాల.. తమ ఫామ్ హౌస్ లో జరిగింది ఫ్యామిలీ పార్టీనే అని తేల్చి చెప్పారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానన్న రాజ్ పాకాలా.. విజయ్ మద్దూరి స్టేట్ మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుందని, కానీ అది నిజం కాదని చెప్పారు. అక్కడ ఉన్న వారిలో ఎవరికో పాజిటివ్ వస్తే తనకేంటి సంబంధమని ప్రశ్నించారు. ఫ్యామిలీ పార్టీలు చేసుకోకూడదా..? అదేమైనా తప్పా అని ప్రశ్నించారు. ప్రస్తుత ఘటన కారణంగా తన కుటుంబం డిస్ట్రబ్ అయ్యిందన్న రాజ్ పాకాలా.. అక్కడ ఏం జరగకపోయినా, కావాలనే విషయాన్ని పెద్దది చేస్తున్నారని ఆగ్రహించారు.

Related News

Janwada Farm House Case : కావాలనే రచ్చ చేస్తున్నారు… నేను ఎలాంటి తప్పు చేయలేదు.

Mayonnaise Ban : మాయదారి మయోనైజ్.. తింటే అంతే సంగతులు, రాష్ట్రంలో నిషేధం

Complaint to ED Against IAS: హాట్ టాపిక్‌గా ఐఏఎస్‌ల దందాలు.. నిన్న అమోయ్, నేడు నవీన్, సోమేశ్ లపై ఈడీకి ఫిర్యాదు

Caste Census: ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేస్తా.. నాకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదు: కులగణన సమీక్షలో సీఎం రేవంత్

CM Revanth Diwali Wishes : పదేళ్ల చీకట్లను తరిమేశాం.. ప్రజలకు సీఎం దీపావళీ శుభాకాంక్షలు

Police Seized Ganja : ఒరిస్సా నుంచి హైదరాబాద్ కి భారీగా గంజాయి స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్

×