EPAPER

Manne Krishank : మూసీ కాంట్రాక్ట్‌పై తప్పుడు ప్రచారం… మన్నె క్రిశాంక్‌కు లీగల్ నోటీసులు

Manne Krishank : మూసీ కాంట్రాక్ట్‌పై తప్పుడు ప్రచారం… మన్నె క్రిశాంక్‌కు లీగల్ నోటీసులు

లీగల్ నోటీసులు


– మూసీ కాంట్రాక్ట్‌పై తప్పుడు ప్రచారం
– మన్నె క్రిశాంక్‌కు లీగల్ నోటీసులు
– నిరాధార ఆరోపణలు తగదన్న మెయిన్ హార్ట్ సంస్థ
– 24 గంటల్లోగా సారీ చెప్పాలని డిమాండ్
– ఏం చేసుకుంటారో చేసుకోమన్న క్రిశాంక్

హైదరాబాద్, స్వేచ్ఛ: ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలన్న లక్ష్యంతో పిచ్చిపిచ్చి ట్వీట్లు చేసి చివరకు నవ్వులపాలు అవుతుంటారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్. గతంలో ఓయూకు సంబంధించి ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేశారని పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం రాగానే కరెంట్​, నీటి సమస్యలు వచ్చాయనే తప్పుడు ప్రచారాన్ని పబ్లిక్​లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు తేల్చారు. రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండి బెయిల్‌పై బయటకొచ్చారు క్రిశాంక్. ఈ క్రమంలోనే మూసీ సుందరీకరణకు సంబంధించి మెయిన్ హార్ట్‌ సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. అదంతా తప్పుడు ప్రచారమని సదరు సంస్థ తాజాగా లీగల్ నోటీసులు పంపించడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.


మన్నె ఆరోపణలు ఇవే !

మూసీ మాస్టర్ ప్లాన్ తయారీ కాంట్రాక్టును మెయిన్ హార్ట్‌ సంస్థకు అప్పగించారని, సదరు కంపెనీపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని కొద్ది రోజుల క్రితం ట్వీట్లు, మీడియా ముందు వ్యాఖ్యలు చేశారు క్రిశాంక్. పాకిస్తాన్‌లో చేసిన ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.3వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని అన్నారు. ఈయన ట్వీట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రీట్వీట్ చేశారు. దీంతో మెయిన్ హార్ట్ కంపెనీ అప్పుడే స్పందించింది. బీఆర్ఎస్ ఆరోపణలను ఖండించింది. తాము పాకిస్తాన్‌లో కన్సల్టెంట్‌గా మాత్రమే వ్యవహరించామని స్పష్టం చేసింది.

సారీ చెప్పాల్సిందే !

మెయిన్ హార్ట్ సంస్థ రియాక్ట్ అయిన తర్వాత కూడా క్రిశాంక్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీంతో నిరాధార ఆరోపణలు తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు పంపించింది. తమ కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దురుద్దేశంతోనే క్రిశాంక్ ఆరోపణలు చేశారని ఫైరయ్యింది. ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు, పరువు నష్టం కలిగించే ప్రకటనలు మానుకోవాలని హితవు పలికింది. 24 గంటల్లోగా సారీ చెప్పి, తమపై చేసిన ట్వీట్లను తొలగించాలని డిమాండ్ చేసింది. లేకపోతే, న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించింది.

ఏం చేసుకుంటారో చేసుకోండన్న క్రిశాంక్

మెయిన్ హార్ట్ సంస్థ ఇచ్చిన నోటీసులపై క్రిశాంక్ స్పందించారు. నోటీసులపై కేటీఆర్‌తో చర్చించానని, బీఆర్ఎస్ లీగల్ సెల్ సమాధానం చెప్తుందని అన్నారు. రూ.3 వేల కోట్ల స్కాంలో మెయిన్ హార్ట్‌కు పాకిస్తాన్ నోటీసులు జారీ చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్వీట్లను తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో మెయిన్ హార్ట్ సంస్థ ఎలా ముందుకు వెళ్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చీఫ్ విప్ ఎలా ఇస్తారు… ఇది రాజ్యంగ విరుద్ధం : ఎమ్మెల్యే హరీశ్ రావు

Related News

Harish rao : బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చీఫ్ విప్ ఎలా ఇస్తారు… ఇది రాజ్యంగ విరుద్ధం : ఎమ్మెల్యే హరీశ్ రావు

Minister Sridhar babu : మీకు ప్రతీది రాజకీయమేనా… హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్న

Warngal : ఫ్లెక్సీ వార్… పోలీస్ స్టేషన్‌కు మంత్రి కొండా సురేఖ

Central Minister vs State Minister: ‘అలయ్ బలయ్’లో రగడ.. కేంద్ర మంత్రి Vs రాష్ట్ర మంత్రి

Kondareddy palli : కొండారెడ్డిపల్లిలో ‘కొండంత’ ఆప్యాయత… మురిసిన సీఎం

Telangana Job Portal : సచివాలయంలో రేపు స్పెషల్ జాబ్ పోర్టల్ ఆవిష్కరణ… హాజరుకానున్న మంత్రి సీతక్క

Big Stories

×