EPAPER

Saddula bathukamma: నేడు సద్దుల బతుకమ్మ.. ట్యాంకుబండ్‌పై స్పెషల్ లేజర్ షో

Saddula bathukamma: నేడు సద్దుల బతుకమ్మ.. ట్యాంకుబండ్‌పై స్పెషల్ లేజర్ షో

laser show in Saddula Bathukamma celebrations: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా నిర్వహించుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిర్వహించుకునే ఈ బతుకమ్మను తొమ్మిది రోజులపాటు కనులపండువగా జరుగుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేస్తారు.


ఇందులో భాగంగా, నేడు సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు పూర్తి చేసింది. నేటితో బతుకమ్మ వేడుకలు కూడా పూర్తికానున్నాయి. అయితే తెలంగాణలో మంచి రోజుగా పరిగణిస్తారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చిన తర్వాత గౌరమ్మకు పూజు చేస్తారు. సాయంత్రం ఆడపడుచులంతా తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలను ఊరేగింపుగా చెరువులు లేదా కుంటల వద్దకు చేరుకొని బతుకమ్మ ఆడడం ఆనవాయితీగా వస్తుంది.

అయితే హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై 10వేల మంది మహిళతో బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారు. బతుకమ్మలతో పాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా రానున్నారు. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసే వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.


ట్యాంక్ బండ్, సంజీవయ్య పార్క్ నుంచి ప్రత్యేకంగా ఫైర్ వర్క్, లేజర్ షోల ప్రదర్శన ఉండనుంది. అలాగే ట్యాంక్ బండ్ చిల్డ్రన్ పార్క్ లో ఉన్న బతుకమ్మ ఘాట్ తో పాటు నెక్లెస్ రోడ్డులోమ బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులను సూచించారు. సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా నేడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Also Read: ఫ్యూచర్ సిటీకి రేస్ కోర్స్.. మంతనాలు కొలిక్కి వచ్చేనట్టే?

బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో అమరవీరుల స్మారక స్థూపం నుంచి అప్పర్ ట్యాంక్ బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. దీంతో ట్రాఫిక్ ను దారి మళ్లించనున్నారు. కావున ప్రయాణికులు ఈ ప్రాంతాల్లో కాకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Related News

Ponnam Prabhakar: ప్లీజ్.. దయచేసి ఆ పని చేయవద్దన్న మంత్రి పొన్నం

Hyderabad Race Course Club: ఫ్యూచర్ సిటీకి రేస్ కోర్స్.. మంతనాలు కొలిక్కి వచ్చేనట్టే?

Land Fraud: అక్రమాల పుట్ట ఇంకా అవసరమా? జూబ్లీహిల్స్ సొసైటీలో అక్రమాలెన్నో- ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

MRPS: మందకృష్ణ మాదిగ అరెస్ట్..

Corrupt wife: భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త.. ఏకంగా వీడియోలు రిలీజ్!

CM Revanth Reddy: రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. 48 గంటల్లోనే మీ అకౌంట్లోకి ఆ డబ్బులు..

Big Stories

×