EPAPER

Land Allotment: గుడ్ న్యూస్.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

Land Allotment: గుడ్ న్యూస్.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

Land Allotment to Journalist: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పింది. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటికీ భూములను అప్పగించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇచ్చిన మాట నెలబెట్టుకున్నాం. సొసైటీకి భూముల కేటాయింపులో మంత్రి పొంగులేటి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. పొంగులేటి వల్లే సొసైటికీ భూముల అప్పగింత సాధ్యమైంది. వృత్తిపరమైన గౌరవం పెంచుకునేలా జర్నలిస్టులు పనిచేయాలి. మా ప్రభుత్వం ప్రజాభిప్రాయం మేరకు పారదర్శకంగా పనిచేస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు పాసులు ఇచ్చాం. నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగనియ్యం’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


Also Read: మున్నేరుకు రిటైనింగ్ వాల్, వరద బాధితులను కేంద్రం ఆదుకుంటుంది: కేంద్రమంత్రి

‘గతంలో జర్నలిస్టులకు ఇళ్లు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అలా వ్యవహరించినప్పుడే సమస్యను పరిష్కరించవచ్చు. మా ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపించింది. సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తులు బాధ్యతాయుతంగా ఉండాలి. అలా వ్యవహరించినప్పుడే సమస్యను పరిష్కరించవచ్చు. మా ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. వృత్తిపరమైన గౌరవం మనకు మనమే పెంచుకోవాలి’ అని సీఎం పేర్కొన్నారు.


Also Read: హేమా హేమీలు పోటీలో ఉన్నా.. టీపీసీసీగా మహేష్ కుమార్ గౌడే ఎందుకంటే?

‘గత బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ జరిగినప్పుడు జర్నలిస్టులను లోపలికి అనుమతించలేదు. మా ప్రభుత్వం వచ్చాక స్పీకర్ కు నేనే అసెంబ్లీ లోపలికి జర్నలిస్టులను అనుమతించాని కోరాను. ఏ వర్గంలోనైనా కొందరు చేసే పని వల్లనే ఇబ్బంది కలుగుతోంది. గతంలో సచివాలయానికి వెళ్లేందుకు మాకే అనుమతి లేదు. కొంతమందికి పాసులు ఇచ్చి లోపలికి రప్పించి ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాంటివారిని జర్నలిస్టులే కట్టడి చేయాలి. అర్హులైన ప్రతి జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు, ఇళ్ల పట్టాలు, హెల్త్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదే. వ్యవస్థల మీద నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలో 73 మంది నిజాన్ని చూడక ముందే కన్నుమూశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలను ఇస్తాం’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×