EPAPER

Lady Aghori Naga Sadhu: మహిళా అఘోరితో ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. సంచలన విషయాలు!

Lady Aghori Naga Sadhu: మహిళా అఘోరితో ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. సంచలన విషయాలు!

Lady Aghori Naga Sadhu Exclusive Interview: తెలంగాణలోని పలు ఆలయాల్లో ఓ మహిళా అఘోరి సందర్శించి పూజలు చేస్తోంది. ఇటీవల కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో పూజలు చేశారు. అలాగే సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలోనూ పూజలు చేశారు. అంతకుముందు ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరుణంలో మహిళా అఘోరితో జరిగిన ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ లో సంచలన విషయాలు చెప్పుకొచ్చింది.


నాగ సాధు.. అఘోరి ఎందుకు మారాల్సి వచ్చింది? ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? హైదరాబాద్ రావడానికి గల కారణాలు ఏంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అఘోరాలు ఎక్కువగా మగవాళ్లే ఉంటారు కదా.. వాళ్లను చూస్తేనే భయపడుతాం.అలాంటిది మీరు లేడీగా ఉండి అఘోరాగా ఎందుకు మారారు. మొదటి నుంచి ఇలాగే ఉన్నారా అని అడగగా.. సంచలన విషయాలు చెప్పింది.

ఏడేళ్ల వయస్సులో అఘోరీగా వచ్చానని, ప్రస్తుతం 26 ఏళ్లు. కన్యతనం ఉన్నప్పుడే వెళ్లిపోయానని అఘోరీ వెల్లడించింది. కుటుంబానికి దూరంగా దైవసంకల్పంతో కొంతమందిని కలిశామని, వాల్లే మమ్మల్ని తీసుకెళ్లారని చెప్పారు. అక్కడ మహిళా అఘోరీలు చాలామంది ఉన్నారని, ఆడవాళ్లు, మగవాళ్లు ఒకేసారి కుంభమేళాకు మాత్రమే బయటకు వస్తామని చెప్పారు.


కుంభమేళా పుష్కరం లాంటిదని, అప్పుడే బయటకు వస్తామని, మిగతా సమయాల్లో బయటకు వెళ్లమని వెల్లడించింది. అయితే నేను రావడానికి ప్రధానం కారణం ఏంటంటే.. లోకకల్యాణం చేయాలనే ఉద్దేశంతో నాకున్న శక్తితో పదిమందికి సాయం చేయడంతోపాటు కష్టాలు తీర్చాలనే సంకల్పంతోనే బయటకు వచ్చానన్నారు.

కొండగట్టు, మిగతా చోట్లకు వెళ్లే సమయంలో కొంతమంది కుటుంబ సభ్యులు కలుస్తారని, అయితే మాకు బంధుత్వాలు ఉండవన్నారు. నాకు అనిపించే వెళ్లానని, మా వాళ్లు కూడా భక్తితో వెళ్లిందని ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు.

Also Read: మియాపూర్‌లో చిరుత సంచారం.. హైదరాబాద్ వాసుల్లో భయం భయం!

ఇతర ఆలోచనలు రావని, కొన్ని కట్టుబాటులతోపాటు శిక్షణ ఉంటుందని, మాకు మోమాయ ఉంటుందన్నారు. ఇందులో ఏ ఆలోచన రాకుండా లీనమై ఉండేలా ఉంటామని, వేరే ఆలోచన రాదన్నారు.

తల్లి గర్బం నుంచి దుస్తులు లేకుండా వచ్చానని, చనిపోయిన తర్వాత కూడా దుస్తులు తీసేస్తారని చెప్పారు. దుస్తులు లేకుండా బయట వెళ్తున్న సమయంలో ఎంతమంది చూసినా నేను పట్టించుకోనని వెల్లడించారు. కామానికి పురుషులు లేదా స్త్రీలు కంట్రోల్ చేసుకోలేక కొంతమంది అలా చేస్తారని, అంతరూ ఒకేలా ఆలోచించరన్నారు.

Related News

Musi river : మూసీకి జలకళ సాధ్యమే..

Congress : ఆన్‌లైన్ డ్రామారావు కేటీఆర్ – చామల కిరణ్ కుమార్ రెడ్డి

Musi River : మూసీ నిర్వాసితులకు సర్కారు చేయూత

Hyderabad: మియాపూర్‌లో చిరుత సంచారం.. హైదరాబాద్ వాసుల్లో భయం భయం!

Mallanna Sagar : మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరిగిందా? హరీష్ రావు మాటల్లో నిజమెంత!

KTR court issue : ఇదేం పద్ధతి? కేటీఆర్‌పై నాంపల్లి క్రిమినల్ కోర్టు అసహనం

Big Stories

×