EPAPER

KTR: ఇదేంటి కేటీఆర్..? ఇదేనా మీ ఐటీ స్ట్రాటజీ

KTR: ఇదేంటి కేటీఆర్..? ఇదేనా మీ ఐటీ స్ట్రాటజీ

– ఉద్యోగుల్ని నిండా ముంచేసిన కేటీఆర్ ఫ్రెండ్ తేజ రాజు
– ఒకేసారి 15 వందల మందికి లేఆఫ్స్
– బ్రేన్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ పేరుతో కంపెనీ
– బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సబ్ కాంట్రాక్టులు పట్టిన తేజ
– కేటీఆర్‌తో ఉన్న స్నేహంతో కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులు
– గజా ఇన్ఫ్రాతో కోట్లు వెనకేసుకున్న తేజ రాజు
– 8 నెలల్లోనే వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ప్రభుత్వ ఐటీ పాలసీపైనే ప్రశ్నలు
– కేటీఆర్.. మీ క్లోజ్ ఫ్రెండ్ చేసిన మోసంపై నిలదీస్తారా?
– బాధితుల బాధను తీరుస్తారా?


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: దాదాపు పదేళ్లపాటు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది. రెండు పర్యాయాల్లో ఐటీ మంత్రిగా కేటీఆర్ వ్యవహరించారు. అనేక సమావేశాలు, విదేశీ పర్యటనలు చేసి భారీ పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పుకున్నారు. నిజానికి హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అనంతరం టీడీపీ, ఆ తర్వాతి ప్రభుత్వాలు దాన్ని కొనసాగించాయి. ఇది ఎవరూ కాదనలేనిది. కానీ, నగరంలో ఐటీ అభివృద్ధి అంతా తామే చేశామన్నట్టు పదేళ్లుగా కేటీఆర్ కలరింగ్ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. కేవలం బీఆర్ఎస్ కృషితోనే పెద్ద పెద్ద కంపెనీలు నగరానికి వచ్చాయని అన్నారు. ఆఖరికి అధికారం పోయినా, కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన పెట్టుబడులపై విమర్శలు చేశారు. షెల్ కంపెనీలను మోస్తున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. అయితే, కేటీఆర్ క్లోజ్ ఫ్రెండ్ తేజ రాజుకు చెందిన ఐటీ కంపెనీ ఉన్నఫలంగా 15 వందల మంది ఉద్యోగులను తీసేసింది. దీనిపై కేటీఆర్ స్పందిస్తారా? అధికారంలో ఉన్నన్నాళ్లూ తేజకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా ఉన్న కేటీఆర్, ఇప్పుడేం చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.


15 వందల మందిని రోడ్డున పడేసిన బ్రేన్ కంపెనీ

మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ బిల్డింగ్ నెంబర్ 3ఏ లోని 3, 4 అంతస్తుల్లో ఉంటుంది బ్రేన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్. దాదాపు 3వేల మందితో ఉన్న ఐటీ కంపెనీ ఇది. సింగపూర్, బెంగళూరులోనూ దీనికి బ్రాంచులు ఉన్నాయి. ఈ కంపెనీ ఓనర్ సత్యం రామలింగ రాజు. ఆయన కుమారుడు తేజ రాజు దీనిని నిర్వహిస్తూ ఉంటాడు. హైదరాబాద్‌లో ఉన్న 3వేల మంది ఉద్యోగుల్లో ఉన్నఫలంగా 15 వందల మందిని తీసేశారు. దీంతో వారంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. పైగా మూడు నెలలుగా జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు.

లేబర్ జాయింట్ కమిషనర్‌కు ఫిర్యాదు

తమను సడెన్‌గా ఉద్యోగం నుంచి తొలగించడంపై ఉద్యోగులు రంగారెడ్డి జిల్లా లేబర్ జాయింట్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మూడు నెలలుగా జీతాలివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అందులో పేర్కొన్నారు. మార్చి నెల 1న రావాల్సిన జీతాన్ని 18వ తేదీకి ఇచ్చారని, కొందరికైతే, ఏప్రిల్ నెల మధ్యలో వేశారని చెప్పారు. ఇంకొందరికైతే ఏప్రిల్, మే చివరి రోజుల్లో పది శాతం మాత్రమే ఇచ్చినట్టుగా వాపోయారు. మే నెల నుంచి జీతాలు ఇవ్వకుండా, చివరకు తమను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. లీడర్‌షిప్ ఆపరేషన్స్ పేరిట మెయిల్స్ వచ్చాయని, బిజినెస్ కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని చెప్పారని వివరించారు. సెప్టెంబర్ 2 లోపు జీతాలు చెల్లిస్తామని చెప్పినట్టు తెలిపారు.

Also Read: Shakeela: మలయాళంలో కంటే టాలీవుడ్‌లోనే ఎక్కువ వేధింపులు: నటి షకీలా సంచలనం

గతంలో సంచలనం రేపిన సత్యం స్కాం

హైదరాబాద్‌లో 1987లో 20 మంది ఉద్యోగులతో మొదలైంది సత్యం కంప్యూటర్స్. తక్కువ సమయంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. బిల్ గేట్స్ అంతటి పేరు సంపాదించుకున్నారు సత్యం రామలింగరాజు. కానీ, ఎంతటి పేరు సంపాదించుకున్నారో అంతే స్థాయిలో పతనమయ్యారు. 2000 దశకంలో రియల్ ఎస్టేట్ రంగం విజృంభించింది. అక్కడి నుంచే రామలింగరాజు పతనం ప్రారంభమైంది. కంపెనీ లావాదేవీల విషయంలో తప్పుడు లెక్కలు చూపారు. దానివల్ల 2001 నుంచి 2008 దాకా బాగా లాభపడ్డారు రామలింగరాజు. 2009 జనవరిలో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆయన కుమారుడి ఆధ్వర్యంలో నడుస్తున్నదే బ్రేన్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్.

సబ్ కాంట్రాక్టులతో పెంచి పోషించిన కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఓవైపు ఘోష్ కమిషన్ విచారణ జరుగుతోంది. నిజానిజాలేంటో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. బ్రేన్ కంపెనీతో 15 వందల మంది ఉద్యోగులను రోడ్డున పడేసిన తేజ రాజు, కాళేశ్వరం సబ్ కాంట్రాక్టులతో బాగా లాభపడ్డారు. కేటీఆర్ క్లోజ్ ఫ్రెండ్ కావడంతో అప్పట్లో అన్ని ద్వారాలు తెరుచుకున్నాయి. గజా ఇన్ఫ్రా పేరుతో కాంట్రాక్టులు తీసుకున్న తేజ, కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. మరి, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రేన్ కంపెనీ 15 వందల మంది ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతుందా? అంటే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్నాళ్లూ ఐటీ మంత్రం జపించిన కేటీఆర్, దీనిపై స్పందించాలని బాధితులు అంటున్నారు. ఆయన ఫ్రెండ్‌ను దీనిపై నిలదీయాలని అడుగుతున్నారు. గజా ఇన్ఫ్రాతో వందల కోట్లు కొల్లగొట్టేందుకు రాచమార్గం వేసినందుకు, ఈ విషయంలోనూ కలుగజేసుకుని న్యాయం చేయాలని అంటున్నారు బాధితులు. మరి, దీనిపై కేటీఆర్ స్పందిస్తారో, క్లోజ్ ఫ్రెండ్‌ను నిలదీస్తారో లేదో చూద్దాం.

Tags

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×