EPAPER

KTR reaction: ఆడపడుచులను అగౌరవపరిచే సంస్కృతి కాదు మాది: కేటీఆర్

KTR reaction: ఆడపడుచులను అగౌరవపరిచే సంస్కృతి కాదు మాది: కేటీఆర్

ktr reacted about his coments on women free bus fecility: తెలంగాణలో రాజకీయ వ్యాఖ్యలు వేడెక్కిస్తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య నిత్యం ఏదో రకంగా వివాదాలు రగులుతూనే ఉన్నాయి. రీసెంట్ గా కేటీఆర్ మహిళలపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. చివరకు ఆయన దిష్టిబొమ్మలను తగులబెట్టే దాకా వెళ్లింది. మహిళా సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆర్టీసీ బస్సులలో తెలంగాణ మహిళలు కుట్లు, అల్లికలు, నిత్యావసరాలు అమ్ముకుంటే తప్పేమిటని కాంగ్రెస్ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అవన్నీ అమ్ముకుంటే ఫర్వాలేదు..వాళ్లు ఎలాంటి బ్రేక్ డ్యాన్సులు చేసినా ఫర్వాలేదు..కానీ బస్సుల్లో టిక్కెట్ కొనుక్కుని సీట్లు దొరకక అల్లాడుతున్న జనాలను పట్టించుకోవడం లేదని అన్నారు. తాను కేవలం బస్సుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.


సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్

తెలంగాణ మహిళా కమిషన్ కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది.తక్షణమే విచారణ జరిపించాలని మహిళా కమిషన్ ను ఆదేశించింది. దీనిపై మంత్రి సీతక్క సైతం కేటీఆర్ పై ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోందని ..అది చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక పోలున్నారని కేటీఆర్ పై రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
కేటీఆర్ తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను ఉద్దేశ పూర్వకంగా మహిళలపై అలాంటి కామెంట్స్ చేయలేదని..తనకు, తమ పార్టీకి మహిళలంటే ఎంతో గౌరవముందని అన్నారు. అనవసరంగా దీనిని ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని అన్నారు.


కించపరిచే ఉద్దేశం లేదు

ఒక వేళ తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరికైనా మనస్తాపం కలిగివుంటే క్షమించమని కోరుకుంటున్నానని అన్నారు. తనకు అక్కచెల్లెళ్లను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని అన్నారు. కావాలనే కాంగ్రెస్ మంత్రులు దీనిని పెద్దగా చేసి రాజకీయం నడుపుతున్నారని అన్నారు. ఇలాంటి చీఫ్ ట్రిక్స్ వలన నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని అన్నారు. పెద్ద మనసుతో తెలంగాణ మహిళలు అర్థం చేసుకుంటారని..ఆ నమ్మకం తనకు ఉందని కేటీఆర్ అంటున్నారు.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×