EPAPER

KTR: రేవంత్ రెడ్డి… నీకు దమ్మంటే ఆ నిర్ణయం తీసుకో : కేటీఆర్

KTR: రేవంత్ రెడ్డి… నీకు దమ్మంటే ఆ నిర్ణయం తీసుకో : కేటీఆర్

KTR Open Challange to CM Revanth Reddy: గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు నువ్వే నేనా అన్న చందంగా ఢీ అంటే ఢీ అంటూ ముందుకువెళ్తున్నారు. ఎక్కడా కూడా ఎవరూ తగ్గడంలేదు. రోజూ ఏదో అంశంపై ప్రతిపక్ష పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీపై కాలు దువ్వుతోంది. బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ నేతలు అంతే ఘాటుగా సమాధానమిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా ఎప్పుడు ఏం జరుగుతుంది.. ఏ నేత ఎవరిపైన విమర్శలు చేస్తున్నారు.. ఆ తరువాత దానికి ఏ నేత రెస్పాండ్ అవుతున్నారు? అనేది ఎట్ ప్రెజెంట్ డిబేట్ టాపిక్ గా మారింది. ఒక్కో రోజు ఒక్కో విధంగా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుంటే ఇటు కాంగ్రెస్ నేతలు వాటిని అంతేస్థాయిలో తిప్పికొడుతూ ఆ పాపం మీ పాలనదే అంటూ ప్రతి విమర్శలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. మొత్తంగా తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ – బీఆర్ఎస్ డిష్యూం డిష్యూం నడుస్తోంది. ఈ యుద్ధంలో చివరకు ఎవరో గెలుస్తారో.. ఎవరో ఓడుతారో అనే అంశాన్ని కొద్దిసేపు పక్కనపెడితే.. ప్రతిపక్ష పార్టీ మరో అంశాన్ని లేవనెత్తింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ విసిరింది. దమ్ముంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ పేర్కొన్నది.


Also Read: ఎమ్మెల్యేలు రోడ్డెక్కి కొట్టుకొంటూ పరువు తీస్తున్నారు: భట్టి

ఆ సవాల్ ఏమంటే.. నిన్నమొన్న హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి – శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య తీవ్ర రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. నేతలు ఇళ్ల వరకు వెళ్లి సవాల్ చేసుకునే పరిస్థితి వరకు వచ్చింది. అంతేకాదు.. ఇళ్లపై దాడులు జరిగిన సందర్భాన్ని కూడా చూసి ఉంటారు. ఈ పంచాయతీ పోలీస్ ఉన్నతాధికారుల ఆఫీసుల వరకు వెళ్లి అక్కడా ఆందోళన చేపట్టడంతో పెద్ద టాపిక్ గా మారింది. అక్కడ కూడా బీఆర్ఎస్ ఆందోళనల పరంపర కొనసాగించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేయకతప్పలేదు. ఈ పరిణామంలో బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రముఖంగా కనిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై వారు విరుచుకుపడిన సిచుయేషన్ ను కూడా మీరు చూసి ఉంటారు. ఇప్పుడు తాజాగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సీన్ లోకి ఎంటరయ్యారు. విదేశాల నుంచి వచ్చిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. వచ్చి రాగానే రేవంత్ రెడ్డికి సవాల్ ను విసిరారు.


Also Read: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్ లో కొద్ది రోజుల క్రితం ఇళ్లను కూల్చిన విషయంలో కేటీఆర్ మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల కడుపు కొట్టేందుకు నువ్వు సీఎం అయ్యావా? అంటూ మండిపడ్డారు. ఆ ఇండ్లు పేదవాళ్లవి, దివ్యాంగులవన్నారు. ఈ విషయం కూడా తెలియకుండా వారి ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ నిలదీశారు. కనీసం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే వారి ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో సీఎంను అయ్యానంటూ చెప్పుకునే రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే పాలమూరు ప్రజల కడుపు కొడుతున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాను చిత్తు కాగింతలా చూస్తూ విలువ ఇవ్వని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆ అధికారులను సస్పెండ్ చేస్తావో లేదా వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తావో.. కానీ, దమ్ముంటే ఏదో ఒక నిర్ణయం తీసుకో రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఆ పేదలకు వెంటనే ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

Related News

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

MSME Policy 2024: కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్

High Court orders: బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

BRS : ఇల్లు గుల్ల.. బయట డొల్ల, ప్రతిపక్షం ఎవరి పక్షం?

Big Stories

×