EPAPER

KTR court issue : ఇదేం పద్ధతి? కేటీఆర్‌పై నాంపల్లి క్రిమినల్ కోర్టు అసహనం

KTR court issue : ఇదేం పద్ధతి? కేటీఆర్‌పై నాంపల్లి క్రిమినల్ కోర్టు అసహనం

KTR court issue : పరువునష్టం కేసులో కేటీఆర్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు ఆగ్రహం శుక్రవారం వ్యక్తం చేసింది. ఈరోజు వాంగ్మూలం తీసుకుంటామని గతంలో స్పష్టంగా చెప్పినా కోర్టుకు డుమ్మా కొట్టి, మళ్లీ సమయం ఎలా కోరటమేంటని కోర్టు కేటీఆర్ తరపు లాయర్‌పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఈ కేసును సోమవారం వాయిదా వేశారు.


ఇదీ కేసు..
గత గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి క్రిమినల్ కోర్టులో మాజీమంత్రి కేటీఆర్ అక్టోబరు 3న పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో కేటీఆర్ తరపు న్యాయవాది 23 రకాల ఆధారాలను కోర్టులో సమర్పించారు. ఈ పిటిషన్‌ను ఈ నెల 14న విచారించిన కోర్టు విచారణను, ఈ కేసు తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్‌తో సహా ఇతర సాక్షుల వాంగ్మూలాలను శుక్రవారం(18) నమోదు చేస్తామని అదే రోజు కోర్టు స్పష్టంగా ప్రకటించింది. ఈ క్రమంలో శుక్రవారం కేటీఆర్ హాజరు కాకపోవటంతో కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ, సోమవారానికి విచారణను వాయిదా వేసింది.

ALSO READ : యాదగిరిగుట్ట లడ్డూ సూపర్… భక్తులకు, ఆలయాలను మరింత చేరువ చేస్తామన్న మంత్రి సురేఖ


వాంగ్మూలాల రికార్డ్
వాస్తవానికి శుక్రవారం ఉదయం సెక్షన్ 356 బీఎన్ఎస్ ప్రకారం కేటీఆర్ సేట్మెంట్‌ను రికార్డ్ చేయాలని కోర్టు భావించింది. కాగా, కొన్ని అనివార్య కారణాల వల్ల కేటీఆర్ విచారణకు హాజరు కాలేకపోయారని ఆయన తరపు లాయర్లు కోర్టుకు సమాధానం ఇచ్చారు. సోమవారం లేదా బుధవారం వరకు సమయం కావాలని కోర్టును వారు రిక్వెస్ట్ చేశారు. దీంతో బుధవారం వరకు కోర్టు సమయం ఇచ్చింది. బుధవారం కేటీఆర్‌ స్టేట్మెంట్‌ను రికార్డు చేస్తామని వెల్లడించింది. అనంతరం ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది.

Related News

Lady Aghori Naga Sadhu: మహిళా అఘోరితో ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. సంచలన విషయాలు!

Musi river : మూసీకి జలకళ సాధ్యమే..

Congress : ఆన్‌లైన్ డ్రామారావు కేటీఆర్ – చామల కిరణ్ కుమార్ రెడ్డి

Musi River : మూసీ నిర్వాసితులకు సర్కారు చేయూత

Hyderabad: మియాపూర్‌లో చిరుత సంచారం.. హైదరాబాద్ వాసుల్లో భయం భయం!

Mallanna Sagar : మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరిగిందా? హరీష్ రావు మాటల్లో నిజమెంత!

Big Stories

×