EPAPER

KTR Comments: మేం అధికారంలోకి వచ్చినంక చేసే మొదటి పని ఇదే : కేటీఆర్

KTR Comments: మేం అధికారంలోకి వచ్చినంక చేసే మొదటి పని ఇదే : కేటీఆర్

BRS MLA KTR Gets Emotional: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. రాఖీ పండుగు సందర్భంగా తన సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ భవన్ లో రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో కేటీఆర్ కు మహిళా నేతలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.


Also Read: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలపై విరుచుకుపడిన బండి సంజయ్

‘రక్షాబంధన్ ఆత్మీయంగా జరుపుకునే పండుగ. సోదరసోదరీమణులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. నా సోదరి కవిత ఈరోజు లేకపోవడం బాధాకరం. 155 రోజులుగా ఆమె జైలులోనే ఉన్నారు. కవితకు న్యాయం జరుగుతుందని నాకు విశ్వాసం ఉంది.


పాత సచివాలయం అస్తవ్యస్థంగా ఉండేది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఫైర్ ఇంజిన్ వెళ్లలేని పరిస్థితి ఉండేది. కేసీఆర్ అద్భుతంగా డిజైన్ చేయించి కొత్త సచివాలయం కట్టించారు. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ సాకారం. సచివాలయం పక్కనే అంబేద్కర్ మహా విగ్రాన్ని ఏర్పాటు చేశాం. అమరవీరుల స్ఫూర్తితో పాలన కొనసాగేలా అమరజ్యోతిని ఏర్పాటు చేశాం. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ బిడ్డ అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారు. అలాంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెడుతున్నారు.

Also Read: నువ్వు రాఖీ కట్టకున్నా.. నీ కష్టాల్లో నేను తోడుంటా.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

మేం రాజీవ్ ఆరోగ్యశ్రీని సంస్కారంతో కొనసాగించాం. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. సచివాలయం ముందు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రాజీవా గాంధీ విగ్రహాన్ని తొలగించి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పేరులో రాజీవ్ గాంధీ పేరును కూడా తొలగిస్తాం. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తెలంగాణ ప్రముఖుడి పేరు పెడుతాం.

మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే మంత్రులు పట్టించుకోవడంలేదు. చెంచు మహిళపై రాక్షసంగా దాడి జరిగితే ఇప్పటివరకు మంత్రులు స్పందించలేదు. మా మహిళా నేతలు వెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Also Read: వేధింపుల సర్కార్: కేటీఆర్ విమర్శలు

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో కూడా కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ కూడా చేశారు. తన సోదరిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ‘నువ్వు ఈరోజు రాఖీ కట్టకపోయినా, నీ కష్టాల్లో నేను ఎప్పుడూ నీ తోడుంటా’ అంటూ అందులో పేర్కొన్నారు. అదేవిధంగా తనకు కవిత రాఖీ కట్టిన ఫొటోను, కవితను ఈడీ అరెస్ట్ చేసిన సమయంలో ఆమె పక్కన తాను నిల్చున్న మరో ఫొటోను కూడా ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.

కాగా, ప్రతి సంతవ్సరం కేటీఆర్ కు కవిత రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతుంది. అయితే, ఆమె అరెస్ట్ అయిన నేపథ్యంలో తీహార్ జైలులో ఉన్న కారణంగా ఆమె కేటీఆర్ కు ఈసారి రాఖీ కట్టలేకపోయిన విషయం విధితమే.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×