EPAPER

KTR : కేటీఆర్.. జూటా మాటలు ఆపి.. జర ఈ లెక్కలు చూసి మాట్లాడు..!

KTR : కేటీఆర్.. జూటా మాటలు ఆపి.. జర ఈ లెక్కలు చూసి మాట్లాడు..!
KTR news today

KTR news today(Latest news in telangana):


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. అయినా కూడా బీఆర్ఎస్ నాయకుల గొప్పలకు హద్దులు లేవు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అహంకారం తగ్గినట్టు కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలలో కేటీఆర్ మాటలు కోటలు కడుతున్నారు. కారుకి రిపేర్ వచ్చిందని.. మళ్లీ రెట్టింపు స్పీడ్‌తో కారు హైవే మీదకు వస్తుందని అంటున్నారు. పార్టీ కార్యకర్తల సంగతి అటుంచితే పార్టీ నేతలే దొరవారిమీద గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అసలు పార్టీ క్యాడర్‌ అయితే కారు దిగి.. ప్రస్తుత సర్కారుకు సై అనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనుకుంటున్నారు.

ఇదిలా ఉంచితే చిన్న దొర ప్రతీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో 14 సీట్లు కోల్పోయామని లేదంటే ఇవ్వాళ మళ్లీ తామే అధికారంలో ఉండేవాళ్లమని కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో నిజమెంతో తెలుసుకుంటే కారు పార్టీ శ్రేణులే ఉస్సూరుమంటాయి.


కాంగ్రెస్ పార్టీ గెలిచిన 64 సీట్లలో వారి మెజార్టీ చూస్తే సారు మాటలన్నీ జూటా మాటలనేది అర్థమవుతుంది.

  • 50 వేలకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లు- 12
  • 40 వేల నుంచి 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లు- 8
  • 30 వేల నుంచి 40 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లు- 12
  • 20 వేల నుంచి 30 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లు- 9
  • 10 వేల నుంచి 20 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లు-12
  • 5 వేల నుంచి 10 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లు- 7
  • 5 వేల లోపు మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లు- 4

ఇక బీఆర్ఎస్ గెలిచిన 39 సీట్లలో మెజార్టీ లెక్కలు చూస్కుంటే

  • 5 వేల నుంచి 10 వేల మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచిన సీట్లు- 6

ఇక చేవెళ్ల నియోజకవర్గంలో కేవలం 268 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. 14 సీట్లలో తక్కువ మెజార్టీతో ఓడిపోతే.. వారు గెలిచిన సీట్లలో 7 సీట్లు అలానే గెలిచారన్న సంగతి చిన్నదొర మరిచిపోయినట్టు అనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రజలు మార్పు కోరుకున్నారన్న విషయాన్ని కారు పార్టీ ఓనర్లు గుర్తించాలి. 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ను ఉంచాలి అనుకున్న జనమే.. ఈ ఎన్నికల్లో దొరవారిని దించాలి అని అనుకున్నారు. ఇదే రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పు సృష్టించింది.

బీఆర్ఎస్ పార్టీ గుర్తించుకోవాల్సింది ఒక్కటే.. తెలంగాణ ప్రజలకు నమ్మడమూ తెలుసు.. ద్రోహం చేస్తే పొలిమేర అవతలికి తరమడమూ తెలుసు. నైజామోడి పైజామూడదీసీన తెలంగాణకు వీరిని ఓడగొట్టడం ఒకలెక్కా. ఇప్పటికైనా ఆహంకారాన్ని పక్కన పెట్టి కారుకు సరైన రిపేర్లు చేసుకుంటేనే తెలంగాణలో ఆ పార్టీకి అస్థిత్వం ఉంటుంది.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×